Atrocious Incident: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైసీపీ కౌన్సిలర్ అరాచకం వెలుగులోకి వచ్చింది. యువతిపై వైసీపీ కౌన్సిలర్ చక్రపాణి అల్లుడు భాస్కర్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధిత యువతి ప్రతిఘటించి భాస్కర్‌ను చెంపదెబ్బ కొట్టింది. యువతి తనను కొట్టిందని తన మామ అయిన స్థానిక కౌన్సిలర్ చక్రపాణికి భాస్కర్ ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో కౌన్సిలర్ చక్రపాణి, మరికొందరు బాధితురాలి కుటుంబాన్ని కట్టెలు, కత్తులతో వెంటాడి దాడి చేశారు. గాయపడిన వారిని స్థానికులు నంద్యాల ఆస్పత్రికి తరలించారు. కౌన్సిలర్, అతడి అనుచరులు దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read Also: Water Society Polls: సాగునీటి సంఘం ఎన్నికల్లో అధికారిపై కత్తితో దాడి.. ఎన్నికలు వాయిదా