YSRCP: సాగునీటి సంఘాల ఎన్నికలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. సాగునీటి సంఘాల ఎన్నికలపై కేంద్రపార్టీ కార్యాలయం నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రీజనల్ కోఆర్డినేటర్స్, జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్దంగా సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అరాచకమని విమర్శించారు.
Read Also: SC Sub-Classification: ఎస్సీ ఉప-వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ వేసిన ఏపీ ప్రభుత్వం
వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకుంటున్నారన్నారు. పలుచోట్ల కూటమి పార్టీలకు చెందిన వారు దాడులకు కూడా తెగబడుతున్నారన్నారు. అభ్యర్థులకు ఎన్వోసీలు ఇవ్వడం లేదన్నారు. పోలీసుల జోక్యంతో వైఎస్సార్‌సీపీ నేతలపై బెదిరింపులు జరుగుతున్నాయని విమర్శించారు. పార్టీ నేతల అభిప్రాయాలను అధినేత వైయస్ జగన్‌కు నివేదించామని సజ్జల పేర్కొన్నారు. అందరి అభిప్రాయాల మేరకు ఎన్నికలను బహిష్కిరంచాలని పార్టీ అధినేత నిర్ణయం తీసుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.