Vijay – Rashmika : విజయ్-రష్మిక పెళ్లి హక్కుల కోసం ఓటీటీ సంస్థ భారీ ఆఫర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల పెళ్లి వార్తలు గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వీరి పెళ్లి గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారక ప్రకటన రానప్పటికీ ఈ నెల 26న వీరి పెళ్ళి జరగబోతుందని న్యూస్ వినిపిస్తోంది.అయితే ఇప్పుడు వీరి పెళ్లి వేడుకకు సంబంధించి ఓ భారీ డీల్ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. వీరిద్దరి వివాహ వేడుకకు సంబంధించిన వీడియో హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ. 60 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం.
సాధారణంగా సెలబ్రిటీల వివాహ వేడుకలను ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ చేయడం ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారింది. గతంలో లేడీ సూపర్ స్టార్ నయనతార – విఘ్నేష్ శివన్ వివాహ డాక్యుమెంటరీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సుమారు రూ. 25 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ రికార్డును తిరగరాస్తూ విజయ్-రష్మిక జంటకు రెట్టింపు కంటే ఎక్కువ మొత్తాన్ని ఆఫర్ చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇంత భారీ మొత్తాన్ని విజయ్ దేవరకొండ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. తన జీవితంలోని అత్యంత ముఖ్యమైన మరియు మధురమైన క్షణాలను వ్యాపార కోణంలో చూడటం తనకు ఇష్టం లేదని పెళ్లి జ్ఞాపకాలు అనేవి చాలా విలువైనవని, వాటిని కేవలం తన కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల మధ్య ప్రైవేట్‌గా ఉంచుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే నెట్‌ఫ్లిక్స్ ఇచ్చిన ఆ ‘మెగా ఆఫర్’కు విజయ్ “బిగ్ నో” చెప్పారనే వార్త ఇప్పుడు అభిమానుల మనసు గెలుచుకుంటోంది. అధికారికంగా ఎటువంటి ప్రకటన రాకపోయినా, తాజా నెట్‌ఫ్లిక్స్ డీల్ భారీ డీల్ ఆఫర్ చేయడం ఈ జంటకు ఉన్న క్రేజ్ ఏంటో తెలియజేస్తుంది.
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
- Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. 'పెరి పెరి మసాలా'ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
-
Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
-
IndiGo Flight: ల్యాండింగ్‌కు ముందు రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
-
Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
ట్రెండింగ్
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!