గతేడాది మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడికి అసోంలోని చిరాంగ్ జిల్లా స్థానిక కోర్టు ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా కూడా విధించింది. చిరాంగ్ జిల్లాలో ట్యుటోరియల్ టీచర్‌గా పనిచేస్తున్న సంజీబ్ కుమార్ రేకు ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి (POCSO) బిజిని గురువారం తీర్పును వెలువరించారు.
గత ఏడాది జరిగిన ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బిజిని పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ, పోక్సో చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బిజిని పీఎస్‌లో నమోదైన ఈ కేసుకు సంబంధించి అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి తుది తీర్పును వెలువరించినట్లు న్యాయవాది ప్రబిన్ దేబ్ రాయ్ తెలిపారు.
Crime News: మరోదారుణం.. మైనర్ అక్కాచెల్లెళ్లపై ఇద్దరు యువకులు అత్యాచారం
“నిందితుడు సంజీబ్ కుమార్ రేకు కోర్టు ఆరేళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది, దానిని చెల్లించని పక్షంలో పోక్సో చట్టంలోని సెక్షన్ 10 కింద మరో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు తీర్పునిచ్చింది” అని న్యాయవాది తెలిపారు.