Presidential Poll: ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి కోసం కాంగ్రెస్ మంతనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దీనిపైనే జోరుగా చర్చ జరుగుతోంది. త్వరలో జరగబోయే భారత రాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి కోసం కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. యూపీఏ తరఫున ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్‌తో పాటు కేంద్ర మంత్రిగా, లోక్ సభ స్పీకర్‌గానూ రాణించిన కాంగ్రెస్ పార్టీ మహిళా నేత మీరా కుమార్‌లు రేసులో ఉన్నట్లు సమాచారం. అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రతిపక్షపార్టీల నేతలతో సంప్రదింపులు చేపట్టారు. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, ఎన్‌సీపీ సుప్రీం నేత శరద్ పవార్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో ఆమె మాట్లాడినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఈ విషయమై విపక్ష పార్టీలతో చర్చలు జరిపి, రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం తీసుకువచ్చే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేకు సోనియా గాంధీ అప్పగించారు. దీనిపై ఖర్గే ఎన్డీయేతర, యూపీయేతర పార్టీల ఆలోచనలు తెలుసుకుంటారు. పలు విపక్ష పార్టీలతో సమావేశాలు నిర్వహించి అభ్యర్థుల పేర్లను తెలుసుకోనున్నట్లు సమాచారం.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
Venkaiah Naidu: రాష్ట్రపతి ఎవరు అవుతారో!.. వెంకయ్యకు పదోన్నతి సాధ్యమేనా?
ఇదిలా ఉండగా.. నిన్న భారత 16వ రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ ఖరారైంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం వచ్చేనెల 24వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో కొత్త ప్రథమ పౌరుడి ఎన్నిక తేదీని నిన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్రపతి ఎన్నికకు జూన్ 15న నోటిఫికేషన్ జారీ చేస్తారు. జులై 18న ఓటింగ్ నిర్వహిస్తారు. 21న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషన్ల అధికారులు కూడా ఈసీ ప్రకటించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. కొత్త రాష్ట్రపతి ఎవరన్నది జులై 21న జరగనున్న ఓట్ల లెక్కింపుతో తేలిపోనుంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!