పృథ్వీ-2 బాలిస్టిక్ మిస్సైల్‌ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్‌లోని ఐటీఆర్ లాంచింగ్ కాంప్లెక్స్-3 నుంచి బుధవారం రాత్రి 7.40 గంటలకు డీఆర్డీవో మిస్సైల్‌ను పరీక్షించగా.. విజయవంతమైనట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీవో) దేశీయంగా అభివృద్ధి చేసింది. ట్రైనింగ్ లాంచ్‌లో మిస్సైల్ ఖచ్చిత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే మిస్సైల్.. 350 కిలోమీటర్ల పరిధిలోకి రేంజ్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ద్రవ […]
ఇండోనేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్-1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. టోర్నీ నుంచి భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ నిష్క్రమించాడు. ప్రపంచ 11వ ర్యాంకర్ శ్రీకాంత్‌కు తొలి రౌండ్లోనే ఊహించని పరాజయం ఎదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 21-23, 10-21తో 41వ ర్యాంకర్ బ్రైస్ లెవెర్‌దెజ్ (ఫ్రాన్స్) చేతిలో అతడు ఓటమి పాలయ్యాడు. గతంలో లెవెర్‌డెజ్‌తో ఆడిన ఐదుసార్లూ గెలిచిన శ్రీకాంత్ ఆరోసారి మాత్రం ఓటమి చవిచూశాడు. 42 నిమిషాల్లో […]
ఇప్పుడు చర్చ మొత్తం రాష్ట్రపతి ఎన్నికలపైనే.. అధికార కూటమి అభ్యర్థి ఎవరు? అనే చర్చ ఓవైపు జరుగుతుంటే.. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎవరు? అనే విషయాలపై విశ్లేషణలు జరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతోంది. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదల అయింది. ఈ నేపథ్యంలో పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నిక లేకుండా ఏకగ్రీవం ద్వారా తమ రాష్ట్రపతి అభ్యర్ధిని గెలిపించుకోవాలని అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఎన్డీయే ఎవరిని పెట్టినా కూడా […]
భారత్‌కు ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి, గల్ఫ్‌లో అత్యంత కీలకమైన యూఏఈ గోధుమల ఎగుమతులపై కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి దిగుమతి చేసుకొన్న గోధుమలను మరో దేశానికి ఎగుమతి చేయడంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాలుగు నెలలపాటు నిషేధం విధించింది. అయితే, మే 14న భారత్ గోధుమ ఎగుమతులను నిషేధించడంతో యూఏఈ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఎగుమతులు, దిగుమతులపై ప్రభావాన్ని దృష్టిలో పెట్టకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూఏఈ ఆర్థిక […]
రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. ఈ ఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్(ఈసీ) నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ విడుదలైన బుధవారమే ఏకంగా 11 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జులై 24న ముగుస్తుంది. ఈ లోగా కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికకు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో ఓటు వేసే వారిలో 50 […]
నేడు రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుండటంతో దేశంలో రాజకీయాలు వేడెక్కాయి. ఓ వైపు ఏకగ్రీవం కోసం బీజేపీ ప్రయత్నిస్తుండగా.. అభ్యర్థి ఎంపిక కోసం విపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. బీజేపీ కూడా ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించకపోవడం గమనార్హం. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలు ప్రతిపాదించే అభ్యర్థికి.. అధికార పక్షం మద్దతు పలకనుందా? ఈ ఎన్నికను ఏకగ్రీవం చేసే దిశగా భాజపా అగ్రనేత రాజ్‌నాథ్ సింగ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయా?… కాంగ్రెస్ లీడర్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇలాంటి […]
భారతీయ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత పేరుందో మరోసారి రుజువైంది. అమెరికాలోని మన భారతీయ రెస్టారెంట్ ‘ఉత్తమ రెస్టారెంట్’గా ఎంపికైంది. నార్త్ కరోలినాలోని డౌన్ టౌన్ యాష్ విల్లేలో ఈ రెస్టారెంట్ ఉంది. దీన్ని 2009లో ప్రారంభించారు. భారతీయ స్నాక్స్‌ను ఈ రెస్టారెంట్ అందుబాటు ధరల్లోనే అందించడం ప్రత్యేకత. చికాగోలో సోమవారం జరిగిన జేమ్స్ బియర్డ్ ఫౌండేషన్ అవార్డుల కార్యక్రమంలో.. అమెరికాలోనే అత్యుత్తమ రెస్టారెంట్‌గా చాయ్ పానీని ఎంపిక చేశారు. న్యూ ఓర్లాన్స్‌కు చెందిన బ్రెన్నాన్‌ను వెనక్కి […]
బిహార్ పాట్నాలోని పీఎంసీహెచ్ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. ఓ వ్యక్తి ప్రైవేటు భాగాల్లో స్టీల్ గ్లాస్ ఇరుక్కుంది. ఈ షాకింగ్ ఘటన నవాదా జిల్లాలో వెలుగుచూసింది. ఓ వ్యక్తి మలద్వారంలోకి స్టీల్ గ్లాస్ చొచ్చుకెళ్లింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని పాట్నాలోని పీఎంసీహెచ్ ఆస్పత్రికి తరలించారు. తొలుత కేసు వివరాలు తెలుసుకుని డాక్టర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆపై పరీక్షలు చేసిన డాక్టర్లు.. మలద్వారం నుంచి గ్లాసును వెనక్కి తీయడం సాధ్యం కాదని […]
రాష్ట్రపతి ఎన్నికలు ఇప్పుడు దేశరాజకీయాల్లో కాకరేపుతున్నాయి. సరైన అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో అధికార, విపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. బీజేపీయేతర ముఖ్యమంత్రులతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ అవుతున్నారు. అయితే ఆమెతో భేటీకి పలువురు సీఎంలు సిద్ధంగా లేనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ నిర్వహించనున్న సమావేశంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి సంబంధించి నిన్నటి వరకు కూడా తమకు ఎలాంటి ఆహ్వానం […]
కేంద్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు, సంస్థలకు 5జీ సేవలను అందించడానికి విజయవంతమైన బిడ్డర్లకు స్పెక్ట్రమ్‌ను కేటాయించే స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించే ప్రతిపాదనను బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీని ప్రకారం 20 సంవత్సరాల చెల్లుబాటు వ్యవధితో మొత్తం 72097.85 MHz స్పెక్ట్రమ్ జులై 2022 చివరి నాటికి వేలం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ 5G సేవలు అందుబాటులోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని.. అలాగే […]