55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!
- OnePlus Nord Buds 4 Pro భారత్‌లో అధికారికంగా లాంచ్
- 55dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్
- 5000Hz బ్యాండ్‌విడ్త్‌తో మెరుగైన నాయిస్ తగ్గింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OnePlus Nord Buds 4 Pro: భారత మార్కెట్‌లో వన్ ప్లస్ (Oneplus) నుండి కొత్త ట్రూలీ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ (TWS) వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 4 ప్రో (OnePlus Nord Buds 4 Pro)ను అధికారికంగా విడుదల అయ్యాయి. ఈ కొత్త Nord Buds 4 Proలో 55dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) కలిగి ఉంది. ఇది 5000Hz బ్యాండ్ విడ్త్ ను సపోర్ట్ చేస్తూ బయట శబ్దాన్ని బాగా తగ్గిస్తుంది. అలాగే LHDC 5.0 Hi-Res ఆడియో కోడెక్, బ్లూటూత్ 6.0, డ్యూయల్ కనెక్షన్, గూగుల్ ఫాస్ట్ పెయిర్ వంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. 12mm డైనమిక్ డ్రైవర్స్‌తో శబ్ద నాణ్యత మరింత మెరుగ్గా ఉంటుంది.
RK Roja: కుటుంబ సమేతంగా ఉగాది వేడుకలు ఎందుకు జరుపుకోలేదు..? గాడిదలు కాస్తున్నారా? రోజా ఫైర్..
Also Read
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
- Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
డిజైన్ పరంగా చూస్తే.. ఈసారి ఓవల్ షేప్‌లో ఉన్న కొత్త ఛార్జింగ్ కేస్‌ను తీసుకొచ్చింది కంపెనీ. ఇది ముందు మోడల్‌తో పోలిస్తే 10% చిన్నదిగా ఉండటం ప్రత్యేకత. ఒక్క ఇయర్‌బడ్ బరువు కేవలం 4.4 గ్రాములు మాత్రమే ఉండటంతో దీర్ఘకాలం ఉపయోగించినా అసౌకర్యం ఉండదు. వీటికి IP55 రేటింగ్ వల్ల నీరు, చెమట నుంచి రక్షణ లభిస్తుంది. ఈ ఇయర్ బడ్స్ లో టచ్ కంట్రోల్స్ తో పాటు స్లైడ్ వాల్యూమ్ కంట్రోల్ కూడా అందించారు. అలాగే AI ఆధారిత ఫీచర్లు కూడా ఉన్నాయి. అలారం, వాతావరణం, రిమైండర్లు వంటి పనులను సులభంగా నిర్వహించడానికి AI అసిస్టెంట్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా, HeyMelody యాప్ ద్వారా రియల్‌టైమ్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ కూడా అందుబాటులోకి రానుంది. ఇంగ్లీష్, హిందీ, స్పానిష్, ఫ్రెంచ్ వంటి భాషలను అనువదించే సామర్థ్యం ఇందులో ఉంది.
Telangana Budget 2026: గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు..!
ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. వీటిని ఒక్కసారి చార్జ్ చేస్తే మొత్తం 54 గంటల ప్లేబ్యాక్ టైమ్ అందుతుంది. ANC ఆఫ్‌లో 13 గంటల వరకు వినియోగించవచ్చు. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కేవలం 10 నిమిషాల చార్జ్‌తో 13 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ లభిస్తుంది. ధర విషయానికి వస్తే రూ. 3,999గా నిర్ణయించగా, ప్రారంభ ఆఫర్‌లో రూ. 3,799కే అందుబాటులో ఉంటాయి. ఈ ఇయర్‌బడ్స్ మార్చి 23 నుంచి అమెజాన్, ఫ్లిప్కార్ట్, వన్ ప్లస్ అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!