Microsoft: ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మైక్రోసాఫ్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ పేర్కొంది. దాదాపు 27 ఏళ్ల క్రితం ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్‌ను క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు నెట్ యూజర్లు అంతా గూగుల్ క్రోమ్, యాపిల్ సఫారీకి అలవాటు పడడంతో.. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు మార్కెట్ తగ్గింది. ఇక విండోస్ 10 నుంచి ఎక్స్‌ప్లోరర్‌కు బదులుగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ చాలా వేగంగా బ్రౌజ్ చేస్తుందని, భద్రతా ప్రమాణాలు కూడా ఎక్కువని, ఐఈతో పోలిస్తే అత్యాధునిక బ్రౌజింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుందని ఆ సంస్థ వెల్లడించింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో చాలా మంది యూజర్లు కామెంట్లతో ముంచెత్తారు. రిప్ సందేశాలను పోస్టు చేశారు. ఇది మొదటిసారిగా 1995లో విండోస్ 95 కోసం యాడ్-ఆన్ ప్యాకేజీగా విడుదల చేయబడింది. తర్వాత, కంపెనీ ప్యాకేజీలో భాగంగా బ్రౌజర్‌ను ఉచితంగా అందించడం ప్రారంభించింది.
ఈ బ్రౌజర్ 2003లో 95 శాతం వినియోగానికి గరిష్ట స్థాయికి చేరుకుంది. కానీ అది తన స్థానాన్ని అలాగే కొనసాగించలేకపోయింది. చాలా మంది పోటీదారులు బ్రౌజర్ మార్కెట్లోకి ప్రవేశించారు. మెరుగైన ఇంటర్‌ఫేస్‌లు, వేగవంతమైన ఇంటర్నెట్ వినియోగం, మంచి పనితీరును అందించడంతో.. ఈ బ్రౌజర్ పోటీని కొనసాగించలేకపోయింది. ఇది క్రమంగా ఇతర బ్రౌజర్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి ఉపయోగించే డిఫాల్ట్ ఎక్స్‌ప్లోరర్‌గా మారింది.
Also Read
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
జూన్ 15, 2022 నుంచి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్ రిటైర్ అవుతుందని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. ఆ తర్వాత కంపెనీ నుంచి ఆ బ్రౌజర్‌కు ఎటువంటి సపోర్ట్ ఉండదన్నది. కానీ ఎక్స్‌ప్లోరర్ ఆధారంగా పనిచేస్తున్న వెబ్‌సైట్లు, అప్లికేషన్లు మాత్రం.. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌తో 2029 వరకు పనిచేయనున్నాయి. ప్రస్తుత మార్కెట్‌లో గూగుల్‌కు చెందిన క్రోమ్ బ్రౌజర్‌ను 65 శాతం వినియోగిస్తున్నారు. ఇక మార్కెట్ షేర్‌లో 19 శాతం యాపిల్ కంపెనీకి చెందిన సఫారీ బ్రౌజర్ ఉన్నది. 3.59 శాతంతో ఫైర్‌ఫాక్స్, 3.39 శాతంతో ఎడ్జ్ బ్రౌజర్‌లు ఉన్నాయి.
తాజావార్తలు
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!