Musharraf: ఆరోగ్య పరిస్థితి విషమం.. ఎయిర్ అంబులెన్స్‌లో పాకిస్థాన్‌కు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో చికిత్స పొందుతున్న పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ను ఎయిర్ అంబులెన్స్‌లో పాకిస్థాన్‌కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయన కోలుకోవడం అసాధ్యంగా మారిందని కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో ఆయనను స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ముషారఫ్ ఫ్యామిలీ కోరుకుంటే స్వదేశానికి ఆయనను తరలించేందుకు వీలు కల్పిస్తామరి పాక్ సైన్యం పేర్కొన్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి.అలాగే ‘కుటుంబ సభ్యుల అంగీకారం, వైద్యుల సలహా మీదట ఆయన్ను పాకిస్థాన్‌కు తిరిగి వచ్చేందుకు అన్ని ఏర్పాటు జరుగుతున్నాయి. పాక్ ఆర్మీ తన మాజీ చీఫ్‌కు అండగా నిలుస్తోంది. తన ఏర్పాట్లలో భాగంగా ఎయిర్ అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచిందని” ఓ ప్రముఖ టీవీ యాంకర్ ట్వీట్ చేశారు.
గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ముషారఫ్ గత మూడు వారాలుగా యూఏఈలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఇటీవల కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన ప్రస్తుతం వెంటిలేటర్‌పై లేరని.. ఆయన ఆరోగ్య పరిస్థితి కోలుకోవడానికి సాధ్యం కానంత క్లిష్టంగా మారిందని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆయనకు అవయవాలు పనిచేయడంలేదన్నారు. ముషారఫ్ కోసం ప్రార్థించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ముషారఫ్ వయస్సు 78 ఏళ్లు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన సైన్యంలో చేరి అంచెలంచెలుగా దేశాధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. 2001 నుంచి 2008వరకు పాకిస్థాన్ అధ్యక్షుడిగా పనిచేశారు.
Also Read
- Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
- China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
- Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
- South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
తాజావార్తలు
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!