Lawrence Bishnoi: మూసేవాలా హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్‌కు 7 రోజుల రిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో సంచలనం సృష్టించిన ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడైన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి మాన్సా కోర్టు ఏడు రోజుల పోలీసు కస్టడీని విధించింది. జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను బుధవారం తెల్లవారుజామున పోలీసులు మాన్సా కోర్టుకు తరలించారు. అతనికి మొదట వైద్య పరీక్షలు నిర్వహించి స్థానిక కోర్టులో హాజరుపరచగా.. అతనికి 7 రోజుల పోలీసు కస్టడీ విధించింది. పోలీసులు 10 రోజుల పోలీసు కస్టడీ కోరగా.. కానీ కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతించింది.ప్రశ్నించేందుకు లారెన్స్ బిష్ణోయ్‌ని మొహాలీకి తీసుకురానున్నారు. సిద్ధూ మూసేవాలా హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ పాత్రకు సంబంధించి గ్యాంగ్‌స్టర్ వ్యతిరేక టాస్క్‌ఫోర్స్ ఇతర ఏజెన్సీలతో కూడిన ప్రత్యేక బృందం ప్రశ్నించనుంది.
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు పంజాబ్ పోలీసులు మంగళవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు నుంచి ట్రాన్సిట్ రిమాండ్ విధించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పంజాబ్ అడ్వొకేట్ జనరల్ స్వయంగా ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుకు హాజరై రిమాండ్ విధించాలని డిమాండ్ చేశారు. పంజాబ్ పోలీసు కస్టడీలో అతని భద్రత కారణంగా నిందితుడు లారెన్స్ బిష్ణోయ్ యొక్క న్యాయవాదులు పంజాబ్ పోలీసుల అభ్యర్ధనను వ్యతిరేకించారు, దీనిని అడ్వొకేట్ జనరల్ పంజాబ్ వ్యతిరేకించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత నిందితులను అరెస్టు చేసేందుకు కోర్టు అనుమతిని మంజూరు చేసింది.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
మే 29న సిద్ధూ మూసేవాలాను గుర్తుతెలియని వ్యక్తులు మాన్సా జిల్లాలో కాల్చి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని పోలీసులు ప్రశ్నించగా.. ఈ హత్య తమ గ్యాంగ్ పనేనని అతడు అంగీకరించాడు. మూసేవాలాతో తమకు వైరం ఉందని.. అందుకే తమ గ్యాంగ్ సభ్యులు అతడిని చంపేశారని అంగీకరించినట్టు ఇటీవలే పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!