రాబోయే ఇంగ్లండ్ పర్యటనకు ముందు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్నాడు. ఆదివారం దక్షిణాఫ్రికా బీచ్‌లో కోహ్లీ సేదతీరాడు. దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకుంటున్న విరాట్ కోహ్లీ బీచ్‌లో సెలవులను ఆనందంగా గడుపుతున్నాడు. విరాట్ తన ట్విటర్‌లో బీచ్‌లో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోను పోస్ట్ చేశాడు. 33 ఏళ్ల కోహ్లీ క్రికెట్ ప్రపంచానికి దూరంగా బీచ్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఐపీఎల్ 2022 అనంతరం జరుగుతున్న దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ నుంచి విరామం తీసుకున్నాడు.
కొవిడ్-19 కారణంగా 2021లో వాయిదా వేయబడి.. రీషెడ్యూల్ చేయబడిన ఐదో టెస్ట్ మ్యాచ్ కోసం ఇండియా ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఐదో టెస్ట్ జులై 1న జరగనుంది. ఆ తర్వాత టీమిండియా ఇంగ్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్ ఆడనుంది. ప్రస్తుతం భారత్ వాయిదా వేయబడిన టెస్ట్ సిరీస్‌లో 2-1 ఆధిక్యంతో ఉంది. చివరి టెస్ట్‌లో గెలిచినా లేదా డ్రాగా ముగించినా..15 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై మొదటి టెస్ట్ సిరీస్ గెలిచినట్లు అవుతుంది. గతంలో 2007లో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో టీమిండియా గెలిచింది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 2007లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో టీమిండియా ఆడింది. ఇప్పుడు అతను భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. 2021లో భారత్ ఇంగ్లండ్‌లో పర్యటించినప్పుడు విరాట్ కోహ్లీ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు కానీ ఇప్పుడు జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడు.