Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Veg Manchurian Recipe: సాయంత్రం వేళ వేడి వేడి స్నాక్స్ తినాలని అనిపిస్తే మనలో చాలా మందికి గుర్తొచ్చే వంటకాలలో ఒకటి వెజ్ మంచూరియా. బయట రెస్టారెంట్లలో దొరికే ఆ స్పెషల్ టేస్ట్ ను ఇప్పుడు మీరు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. కొద్దిపాటి పదార్థాలతో, సరైన విధానాన్ని పాటిస్తే క్రిస్పీగా, టేస్టీగా మంచూరియా సిద్ధమవుతుంది. మరి అది ఎలాగో చూసేద్దామా..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
మంచూరియా బాల్స్ తయారీ:
ముందుగా మంచూరియా బాల్స్ తయారీతో ప్రారంభించాలి. ఇందుకోసం ఒక మిక్సింగ్ బౌల్‌లో సన్నగా తరిగిన క్యాబేజీ తీసుకుని అందులో తగినంత ఉప్పు వేసి బాగా కలిపి 2-3 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇలా చేస్తే క్యాబేజీలోని తేమ బయటకు వస్తుంది. తర్వాత అందులో మైదా పిండి, కార్న్ ఫ్లోర్‌ను సమానంగా జోడించాలి. అలాగే కారం, అల్లం-వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి బాగా కలపాలి. నీళ్లు వేయకుండా క్యాబేజీలో ఉన్న తేమతోనే ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసి వేడిగా ఉన్న నూనెలో మీడియం ఫ్లేమ్‌పై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇలా వేయించిన మంచూరియా బాల్స్ బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉంటాయి.
IPL 2026: ఐపీఎల్ మ్యాచ్‌లపై సెలక్టర్ల ఫోకస్.. ఇక్కడ ఆడితేనే వరల్డ్ కప్ 2027 తుది జట్టులో చోటు..!
మంచూరియా సాస్ తయారీ:
మంచూరియా సాస్ తయారీకి ఒక పాన్ తీసుకుని కొద్దిగా నూనె వేయాలి. అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, క్యాప్సికం ముక్కలు వేసి హై ఫ్లేమ్‌పై వేగించాలి. వీటిలో గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, టొమాటో కెచప్ వేసి కలపాలి. రుచి కోసం కొద్దిగా మిరియాల పొడి, వెనిగర్ జోడించాలి. సాస్ చిక్కబడేందుకు ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్‌ను నీళ్లలో కలిపి పాన్ లో పోయాలి. సాస్ కాస్త గట్టిపడిన తర్వాత ముందుగా తయారు చేసిన మంచూరియా బాల్స్ వేసి హై ఫ్లేమ్‌పై టాస్ చేయాలి. చివరగా కొత్తిమీర లేదా ఉల్లికాడలు చల్లి గార్నిష్ చేస్తే వేడివేడి రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియా రెడీ. ఈ విధంగా ఇంట్లోనే శుభ్రంగా, రుచికరంగా రెస్టారెంట్ స్టైల్ మంచూరియాను తయారు చేసి కుటుంబంతో కలిసి ఆస్వాదించండి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!