Encounter: షోపియాన్ జిల్లాలో కాల్పుల మోత.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్ముకశ్మీర్‌లో ముష్కరుల ఏరివేత కొనసాగుతోంది. దక్షిణ కశ్మీర్‌లో షోపియాన్ జిల్లాలోని కంజియులర్ ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కంజియులర్ ప్రాంతంలో ఉగ్ర కార్యకలాపాలు జరగుతున్నాయనే ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు భద్రతాబలగాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయని, ఈ సందర్భంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారని వెల్లడించారు.
వారు లష్కరే తొయీబాకు చెందినవారని, వారిలో ఒకరు షోపియాన్‌కు చెందిన జాన్ మహ్మద్ లోన్‌గా గుర్తించామన్నారు. అతడు జూన్ 2వతేదీన కుల్గాం జిల్లాలో బ్యాంకు మేనేజరు విజయ్ కుమార్‌ను హతమార్చిన కేసులో నిందితుడని వెల్లడించారు. మరో ఉగ్రవాదిని గుర్తించాల్సి ఉందన్నారు. ఘటనా స్థలంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. గత కొన్ని నెలలుగా కశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య వరుస కాల్పులు జరుగుతున్నాయి. వీటిలో చాలా మంది ఉగ్రవాదులు, కమాండర్లు అంతం అయ్యారు.
Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
కాగా, సోమవారం రాత్రి శ్రీనగర్‌లోని బెమినా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. వారిలో ఒకరు షోపియాన్ జిల్లాకు చెందినవారు. ఆ కాల్పుల్లో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!