దేశంలోనే తొలిసారిగా ప్రైవేటు రైలు సర్వీస్ ప్రారంభమైంది. ‘భారత్ గౌరవ్’ పేరుతో ప్రైవేటు రైళ్లను నడుపనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ గౌరవ్’ పేరుతో ప్రైవేటు రైళ్లను నడుపనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు తొలి ప్రైవేటు రైలు తమిళనాడులోని కోయంబత్తూరు నార్త్ నుంచి మహారాష్ట్రలోని షిరిడీ సాయినగర్‌కు మంగళవారం సాయంత్రం 6 గంటలకు బ యల్దేరింది. దీంతో దేశంలోనే తొలి ప్రైవేటు రైలు సర్వీసును ప్రారంభించిన ఘనత దక్షిణ రైల్వేకి దక్కింది.
20 బోగీలు కలిగిన ఈ రైలును సేలం డివిజన్ డివిజినల్ రైల్వే మేనేజర్ గౌతమ్ శ్రీనివాస్ ప్రారంభించారు. తొలి రోజే ఈ రైలులో 1,100 మంది ప్రయాణించారు. ఈ ప్రైవేటు రైలు గురువారం ఉదయం 7.25 గంటలకు షిరిడీ చేరుతుంది. తిరుప్పూరు, ఈరోడ్, సేలం, యెలహంక, ధర్మవరం, మంత్రాలయం స్టేషన్లలో ఆగనుంది. షిరిడి చేరుకున్నాక ప్రయాణికులకు బస్సు సదుపాయం, సాయి దేవాలయ దర్శనం తదితర ఏర్పాట్లను కూడా కల్పిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో ఈ రైలు మంత్రాలయం వద్ద 5 గంటలు ఆగుతుంది. ఆ సమయంలో భక్తులు మంత్రాలయం దర్శనం చేసుకుని రావచ్చు.
కాగా, 20 బోగీలు కలిగిన ఈ రైలులో 1500 మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉందని దక్షిణ రైల్వే సీపీఆర్వో గుగణేశన్ తెలిపారు. ఇందులో ఏసీ కోచ్‌లతోపాటు స్లీపర్ కోచ్‌లు ఉన్నాయన్నారు. ఈ రైలును నిర్వాహకులకు రెండేళ్ల కాలపరిమితికి లీజుకిచ్చినట్లు ఆయన తెలిపారు. నెలలో కనీసం 3 ట్రిప్పులు నడపనున్నట్లు పేర్కొన్నారు.