సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన అల్లర్లపై పౌరహక్కుల సంఘం నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. అల్లర్లపై ఫాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ కోసం రైల్వేస్టేషన్‌కు సభ్యులు చేరుకుని వివరాలను సేకరించారు. అల్లర్లకు గల కారణాలు, పోలీసుల కాల్పులపై నివేదికను సిద్ధం చేయనున్నారు. సికింద్రాబాద్ అల్లర్లపై నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశామని పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ వెల్లడించారు. అభ్యర్థులు, పోలీసుల కాల్పుల అంశంలో ఫాక్ట్ ఫైండింగ్ నివేదిక సిద్ధం […]
పింఛన్లు, ఆర్థిక భారాన్ని తగ్గించడానికి రక్షణ శాఖలో అగ్నిపథ్ తీసుకొచ్చారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. నాలుగేళ్లకే రిటైర్ అవ్వడం అంటే పెళ్లికాగానే వితంతువు అయినట్లేనని ఆయన వర్ణించారు. నాలుగేళ్లలో 6నెలలు ట్రైనింగ్‌కే వెళ్తుందని.. ఆ 6 నెలల్లో ఏమి నేర్చుకుంటారని ప్రశ్నించారు. రక్షణ శాఖలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చి సైనికులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఆ ఆక్రోశం వల్లే యువకులు బులెట్లు తగిలినా వెనక్కి తగ్గలేదన్నారు. డిఫెన్స్ నిధులకు కోత […]
వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. తాను పాలేరు నుంచి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. వారి కోరిక మేరకు తాను పాలేరు నుంచే పోటీ చేయనున్నట్లు షర్మిల స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పాలేరు నియోజక వర్గ కార్యకర్తలతో వైఎస్ షర్మిల సమావేశమయ్యారు. ఖమ్మం జిల్లాలో ఎంతో మంది వైఎస్సార్ ఫోటో పెట్టుకొని గెలిచారని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో […]
జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. విధానాన్ని తీసుకురావడం కాదు.. దానిని ఆచరించాలని ఆమె సూచించారు. విద్య ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనదని.. దేశ ఆర్థిక, సామాజిక అభివృద్దికి విద్య అనేది ఎంతో అవసరమన్నారు. ‘ఉన్నత విద్యపై జాతీయ విద్యా విధానం-2022 యొక్క ప్రభావాలు’ అనే అంశంపై హైదరాబాద్ హైటెక్స్‌లోని శిల్పకళావేదికలో జరిగిన కాన్ఫరెన్స్‌లో ఆమె ప్రసంగించారు. చదువును మధ్యలో ఆపేవాళ్లను చాలావరకు తగ్గించగలిగామని గవర్నర్ వెల్లడించారు. కానీ […]
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో మావోయిస్టుల పేరిట లేఖ కలకలం రేపింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయానికి మావోయిస్టు జగన్ పేరిట లేఖను అంటించడం జిల్లాలో కలకలం రేపుతోంది. స్థానిక రేషన్ డీలర్ పేరుతో పాటు, ప్రస్తుత సర్పంచ్, మాజీ సర్పంచ్ పేరు, ఓబులాపూర్ లోని ఓ సామాజిక వర్గం అంశాన్ని ప్రస్తావిస్తూ హెచ్చరికలు జారీ చేసి గ్రామ పంచాయతీకి అతికించారు. తమ హెచ్చరికలను భేఖాతరు […]
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్ల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అగ్నిపథ్ ఆందోళనలతో చెలరేగిన హింసపై విచారణ కొనసాగిస్తున్నారు. ఎవరెవరు ఆందోళనలో పాల్గొన్నారు? వీరంతా ఒక్కసారిగా ఎలా వచ్చారు? వీరు హింసకు పాల్పడేలా ఎవరైనా ఉసిగొల్పారా? అనే కోణంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే 52 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఏడుగురు అనుమానితులను రైల్వే పొలీసులు విచారిస్తున్నారు. సీసీ కెమెరా, పోలీస్ వీడియో రికార్డింగ్, మీడియా ఫుటేజ్, సోషల్ మీడియా, సెల్ ఫోన్ […]
శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన నిరసనల సందర్భంగా రైల్వే పోలీసు అధికారులు 8ఏళ్ల క్రితం నాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లనే ధరించినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం సుమారు 2,000 మంది ఆర్మీ ఆశావహులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆవరణలోకి ప్రవేశించి, కోచ్‌లను తగులబెట్టి నిరసన వ్యక్తం చేయడంతో పోలీసు అధికారులు రాళ్ల దాడులను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పడి దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత కూడా రాష్ట్ర పోలీసులు ‘ఏపీ పోలీస్’ అని రాసి ఉన్న బుల్లెట్ ప్రూఫ్ […]
కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిందే బాసరలోని ఆర్టీయూకేటీ. కొన్నేళ్లుగా నిర్వహణ లోపంతో సమస్యలు చుట్టుముట్టాయి. కొద్ది రోజులుగా విద్యార్థులు ఆందోళనలు నిర్వహిస్తున్న క్రమంలో ఒక్కో సమస్య వెలుగులోకి వస్తోంది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడం కోసం ఎన్టీవీ సాహసం చేసింది. సమస్యల సుడిగుండంలో ఉన్న విద్యార్థులను ఎన్టీవీ బృందం పలకరించింది. దారుణమైన పరిస్థితి ఉందంటూ ఎన్టీవీతో విద్యార్థులు గోడు వెళ్లబోసుకున్నారు. బాసర ట్రిపుల్ […]
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులోని ఓ కంపెనీలో రియాక్టర్ పేలింది. దీంతో భారీగా విషవాయువులు వెలువడ్డాయి. అవి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో.. దుర్వాసనతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వెలిమినేడు, పేరేపల్లి, పిట్టంపల్లి, బొంగోనిచెరువు గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చెందారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దగ్గు వాంతులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. రియాక్టర్ నుంచి వెలువడిన విషవాయువుల గురించి […]
పని భారం, అధికారుల వేధింపులు భరించలేక ఒక ఆర్టీసీ డ్రైవర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన బండి స్వామి గౌడ్ (35) కామారెడ్డి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఇంటి వద్దనే ఉన్నాడు. విధులకు హాజరు కావాలని ఆర్టీసీ అధికారులు తరచూ ఫోను ద్వారా స్వామికి సమాచారం అందిస్తున్నారు. విధులకు రాకపోతే […]