సాంసంగ్ గెలాక్సీ సిరీస్‌లో లాంఛ్ చేసిన స్మార్ట్‌ఫోన్లు ఎంతగా పాపులర్ అయ్యాయో అందరికి తెలిసిందే. సాంసంగ్ ఎఫ్ సిరీస్‌లో మరో మొబైల్ లాంఛ్ చేయబోతోంది. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో లాంఛ్ చేయబోతోంది. ఇందులో 6,000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్, 50MP కెమెరా లాంటి ప్రత్యేకతలు ఉండబోతున్నాయి. జూన్ 22న సాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 లాంఛ్ చేయనున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌లో టీజర్ కనిపించింది. దీంతో డిజైన్‌కు సంబంధించిన సమాచారం బయటికి వచ్చింది. డిజైన్‌తో పాటు కొన్ని ఫీచర్లు కూడా రివీల్ అయ్యాయి. గెలాక్సీ ఎం13ను ఈ మొబైల్ పోలి ఉంటుందని తెలుస్తోంది. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 డిజైన్, స్పెసిఫికేషన్లు ఎలా ఉండనున్నాయో, అంచనా ధర వివరాలు చూడండి. ఇప్పటికే యూరప్ మార్కెట్‌లో లాంఛ్ అయిన సాంసంగ్ గెలాక్సీ ఎం13 మోడల్‌నే రీబ్రాండ్ చేసి ఇండియాలో సాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 పేరుతో రిలీజ్ చేయొచ్చన్న వార్తలు కూడా వస్తున్నాయి.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్13 భారత్‌లో బడ్జెట్ రేంజ్‌లో వస్తుంది. రూ.12వేల నుంచి రూ.15వేల మధ్య ధరతో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రెండు వేరియంట్లను సామ్‌సంగ్ తీసుకొస్తుందని అంచనా. స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. సాంసంగ్‌కు చెందిన ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ సాంసంగ్ గెలాక్సీ ఎం12, సాంసంగ్ గెలాక్సీ ఎఫ్12, సాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ లాంటి మోడల్స్‌లో ఉంది.
సాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ ప్లస్ ఫీచర్‌తో 8జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే 50మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 5మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 2మెగాపిక్సెల్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 15వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మూడు కలర్స్‌లో ఈ ఫోన్ లభించనుంది.