దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తూనే ఉన్నది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వరుసగా ఐదో రోజు 12వేలకుపైగా కొత్త కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 12,781 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 18 మంది కరోనాతో మృత్యువాతపడగా.. 8,537 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 76,700గా ఉంది. ప్రస్తుతం రోజువారి పాజిటివిటీ రేటు 4.32శాతం ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. కొత్తగా […]
అమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. శ్వేతసౌధం సమీపంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో పోలీస్ అధికారి సహా పలువురికి బుల్లెట్లు తగిలాయి. అమెరికా రాజధాని నగరమైన వాషింగ్టన్ డీసీ 14 అండ్ యూ వీధిలోని జునెటీంత్ మ్యూజిక్ కన్సెర్ట్ సమీపంలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఫైరింగ్‌లో ఒకరు మృతిచెందగా.. పోలీస్ అధికారి సహా పలువురికి తూటాలు తగిలినట్లు మెట్రోపోలిటన్ పోలీస్ విభాగం తెలిపింది. ఈ ఘటన అధ్యక్ష భవనమైన శ్వేత సౌధానికి సమీపంలోనే […]
బిహార్ రాష్ట్రంలో పిడుగుపాటుకు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. భాగల్పూర్ జిల్లాలో గరిష్టంగా పిడుగుపాటుకు ఆరుగురు మరణించారు. వైశాలి జిల్లాలో ముగ్గురు, బంకా జిల్లాలో ఇద్దరు, ఖగారియా జిల్లాలో ఇద్దరు, ముంగేర్, కతిహార్, మాధేపురా, సహర్సా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున పిడుగుపాటుకు ప్రాణాలు వదిలారు. శనివారం రాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో భారీవర్షాలు కురవడంతో 17 మంది మరణాలు సంభవించాయి. బిహార్ రాష్ట్రంలో గత ఏడాది కూడా పిడుగు పాటుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. […]
తూర్పు ఆఫ్రికాలోని ఇథియోపియా జాతుల ఘర్షణలతో మరోసారి నెత్తురోడింది. ఈ ఘర్షణల్లో అమ్హారా తెగకు చెందిన 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఒరోమియా ప్రాంతంలో జరిగిన ఈ ఘర్షణల్లో 230 మంది మరణించినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. జాతుల ఘర్షణలో ఇటీవల జరిగిన అత్యంత దారుణమైన ఘటన ఇదేనని అధికారులు చెబుతున్నారు. రెబల్ గ్రూపే ఊచకోతకు పాల్పడిందని ఆరోపణలు వినిపిస్తుండగా, ఆ గ్రూపు మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. ఆఫ్రికాలోనే అత్యంత ఎక్కువ జనాభా గల […]
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ‘అగ్నిపథ్ స్కీమ్’పై స్పందించారు. అగ్నిపథ్‌పై జరుగుతున్న హింసపై విచారం వ్యక్తం చేశారు. అటువంటి శిక్షణ పొందిన, సమర్థులైన యువతను రిక్రూట్ చేసుకోవడానికి మహీంద్రా గ్రూప్ అవకాశం కల్పిస్తుందన్నారు. అగ్నివీరులకు మహీంద్రా గ్రూప్ స్వాగతం పలుకుతుందన్నారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఒక ట్వీట్‌లో “అగ్నిపథ్ పథకం నేపథ్యంలో జరిగిన హింసాత్మక సంఘటనలు చాలా బాధాకరమైనవి. గత సంవత్సరం ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు, అగ్నివీరులు నేర్చుకున్న క్రమశిక్షణ, నైపుణ్యం వారిని ఉన్నతంగా […]
దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలో మాత్రం స్వల్పంగా తగ్గుముఖం కనిపించింది. దేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యతనిస్తుంటారు మహిళలు. ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. కాగా అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కొవిడ్, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర […]
Agnipath Scheme Protest: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కొన్ని సంస్థలు సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే దీనికి అనుమతిలేదని, పాల్గొంటే కఠిన చర్యలుంటాయని ప్రభుత్వాలు హెచ్చరించాయి. రైల్వే స్టేషన్ల వద్ద భద్రత పెంచారు. భారత్ బంద్ దృష్ట్యా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఆర్పీఎఫ్ సీనియర్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేసారు. అల్లర్లు, విధ్వంసానికి పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్ని […]
నేషనల్ హెరాల్డ్ కేసులో నాలుగో విడత విచారణ నిమిత్తం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపట్టనుంది. పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి తీవ్రనిరసనల మధ్య రాహుల్ గాంధీని జూన్ 13 నుంచి 15వరకు మూడు రోజుల పాటు ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. మరో సారి ఈ నెల 17న విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు […]
సోనియాగాంధీ ఆదేశాలతో సత్యగ్రహ దీక్ష జరుగుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి వెల్లడించారు. అగ్నిపథ్‌పై పార్లమెంట్‌లో చర్చించకుండా యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆమె మండిపడ్డారు. మోదీ తీసుకొచ్చిన ప్రతి పథకం తన స్నేహితులు అదానీ, అంబానీల కోసమేనని ఆరోపణలు చేశారు. శ్రీలంకలో కూడా మోదీ అదానీకి సహకరించేలా ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. మాకు అగ్నిపథ్ వద్దని విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారని ఆమె తెలిపారు. అగ్నిపథ్‌తో రక్షణ శాఖలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ […]
ఖమ్మం జిల్లాలో వైఎస్సార్ ఫొటో పెట్టుకుని ఎంతో మంది గెలిచారని.. మంత్రి పువ్వాడ అజయ్‌కు ఆయన్ను విమర్శించే స్థాయి లేదని చెప్పారు. తనకు బయ్యారం మైనింగ్‌లో వాటా ఉన్నట్లు చేసిన ఆరోపణలు అవాస్తవమని షర్మిల స్పష్టం చేశారు. ఈ విషయంలో తన బిడ్డలపై ప్రమాణం చేసి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మంత్రిగా ఎటువంటి అవినీతికి పాల్పడలేదంటూ తన బిడ్డలపై ప్రమాణం చేసే ధైర్యం పువ్వాడకు ఉందా? అని ఆమె సవాల్ విసిరారు. ఆయన మెడికల్ కాలేజీకి […]