రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై ఎన్డీఏ ముమ్మర కసరత్తు చేస్తోంది. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు అధికార, ప్రతిపక్ష కూటముల నుంచి రాష్ట్రపతి అభ్యర్థి పేరు ఖరారు కాలేదు. విపక్షాలు ఇంకా తమ అభ్యర్థిని ఎన్నుకోనప్పటికీ మంగళవారం ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి పేరును మంగళవారం ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అధికార పక్షం తర్వాతే విపక్షాలు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. భాజపా […]
అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత్ సహా ప్రపంచ దేశాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలోని మైసూర్ నుంచి యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో వేకువజామునుంచే ప్రముఖులు సహా సామాన్య ప్రజలు యోగాసనాలు వేస్తున్నారు. మానవత్వం కోసం యోగా(Yoga for humanity) అనే ఇతివృత్తంతో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కర్ణాటకలో ప్రధాని మోదీ ఈవెంట్‌లో సుమారు 15 వేల మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రధానితో పాటు కేంద్ర మంత్రి సర్భానంద […]
మధ్యప్రదేశ్‌లో మావోయిస్టులు-భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు సహా ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. బాలాఘాట్ జిల్లాలోని లోదంగి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ కాల్పులు జరిగాయి. ఈ ముగ్గురి మావోలపై రూ.30లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలాఘాట్ జిల్లాలోని బహేలా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిందని ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఈ […]
ముస్లిం యువతుల వివాహాలపై పంజాబ్, హర్యానా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లు నిండిన ముస్లిం యువతి తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పులో పేర్కొంది. 21 ఏళ్ల యువకుడు, 16 ఏళ్ల యువతి కుటుంబ సభ్యుల నుంచి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన ముస్లిం దంపతుల రక్షణ పిటిషన్‌ను జస్టిస్ జస్జిత్ సింగ్ బేడీ ధర్మాసనం విచారిస్తూ ఈ తీర్పును వెలువరించింది. జస్టిస్ బేడి షరియా […]
భారత యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం రాత్రి వ్యవహరించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. వర్షం కారణంగా రద్దయిన ఈ పోరులో గైక్వాడ్.. మైదాన సిబ్బంది ఒకరితో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. అక్కడ దక్షిణాఫ్రికాతో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా.. వర్షం పడే సమయంలో డగౌట్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్‌తో సెల్ఫీ కోసం గ్రౌండ్స్‌మ్యాన్ ప్రయత్నించాడు. కానీ.. గ్రౌండ్స్‌మ్యాన్ తనకి క్లోజ్‌గా […]
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తేలికపాటి జ్వరంతో అస్వస్థత చెందారని ఆ రాష్ట్ర నీటివనరుల శాఖ మంత్రి దురైమురుగన్ తెలిపారు. శనివారం రాత్రి నుంచి ఆయనకు జ్వరం రావటంతో వైద్యులు పరిశీలించి రెండు రోజుల విశ్రాంతి అవసరమని సూచించారని మంత్రి దురైమురుగన్ వెల్లడించారు. జ్వరం కారణంగా సోమవారం మూడు జిల్లాల్లో జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన రద్దయ్యింది. ముందుగా ప్రకటించిన మేరకు స్టాలిన్ వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాల్లో ఈ రోజు పర్యటించాల్సి ఉంది. స్టాలిన్ పర్యటనకు అధికారులు, […]
కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్‌ను నిరసిస్తూ పలు సంఘాలు, రాజకీయ పార్టీలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో బంద్ పాటిస్తున్నారు. దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. భారత్ బంద్ నేపథ్యంలో దిల్లీ సరిహద్దుల్లో పోలీసులు నేడు తనిఖీలు […]
నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ నిమిత్తం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు వరుసగా నాలుగోసారి ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీని ఇప్పటి వరకు దాదాపు 30 గంటల పాటు ఈడీ విచారించింది. శుక్రవారమే విచారణకు రావాలని ఈడీ రాహుల్‌కు సమన్లు జారీ చేయగా.. మూడు రోజులు సమయం ఇవ్వాలని కోరారు. తన తల్లి సోనియా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఈ క్రమంలో 17న కాకుండా 20న విచారణకు […]
రియల్‌మీ నుంచి చౌకైన స్మార్ట్‌ఫోన్ నేడు భారత మార్కెట్‌లో అడుగుపెట్టనుంది. రియల్‌మీ సీ30 పేరుతో ఈ మొబైల్ రానుంది. ఈ విషయాన్ని రియల్‌మీ అధికారికంగా ప్రకటించింది. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ ఫోన్ విడుదల కానుంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే ఈ ఫోన్ కోసం మైక్రోసైట్ ఏర్పాటు చేసింది. UniSoc T612 ప్రాసెసర్‌తో ఈ బడ్జెట్ ఫోన్ రానుంది. 5000mAh బ్యాటరీ ఉంటుంది. 10వాట్ల సాండర్డ్ ఛార్జింగ్ స్పీడ్ ఉంటుందని తెలుస్తోంది. వీటితో పాటు […]
స్టాక్ మార్కెట్ సూచీలు ఎట్టకేలకు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపడంతో అవి ఎంతోసేపు నిలవలేదు. చూపుతున్నాయి. గరిష్ఠాల వద్ద అమ్మకాల ఒత్తిడితో కాసేపటికే ఊగిసలాట ధోరణిలోకి జారాయి. గతవారపు భారీ నష్టాల నేపథ్యంలో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో కొనసాగుతోంది. ఉదయం 10.32 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 78 పాయింట్లు నష్టపోయి 51,281 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 34 […]