నోబెల్ ప్రైజ్.. ప్రపంచంలోనే అత్యంత గౌరవాన్ని, కీర్తిని తెచ్చిపెట్టే బహుమతి. వివిధ రంగాల్లో ఉద్దండులకు మాత్రమే ఈ అవార్డును ఇస్తారు. అలాంటిది ఓ రష్యా జర్నలిస్టు ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా నిరాశ్రయులైన పిల్లలకు ప్రయోజనం చేకూర్చడానికి రష్యా జర్నలిస్టు దిమిత్రి మురతోవ్ నోబెల్ శాంతి బహుమతిని సోమవారం వేలం వేశారు. ఈ వేలంలో నోబెల్ శాంతి బహుమతి సుమారు 800 కోట్ల(103.5మిలియన్ డాలర్లు)కు అమ్ముడుపోయింది. మురాతోవ్ 2021లో ఫిలిప్పీన్స్‌కు చెందిన జర్నలిస్ట్ […]
ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకునే ముందు తమ వాదన వినాలని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం విన్నవించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్ర సర్కారు కేవియట్ దాఖలు చేసింది. అగ్నిపథ్‌పై ఇప్పటివరకు మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది హరీశ్ అజయ్ సింగ్ సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. ఎంఎల్ శర్మ అనే న్యాయవాది అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సుప్రీంలో పిల్ దాఖలు చేసి […]
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొననుండడం సంచలనంగా మారింది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంపై అసంతృప్తితో మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్‌నాథ్ షిండే.. మరో 11 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని గుజరాత్‌లో సూరత్‌కు వెళ్లినట్లు సమాచారం. తన వెంట 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఏక్‌నాథ్ షిండే తెలిపినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. వీరంతా గుజరాత్ భాజపా అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సూరత్‌లోని గ్రాండ్ భగవతీ హోటల్‌లో ఆ ఎమ్మెల్యేలు బస చేస్తున్నట్లు […]
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలోనే 400 పాయింట్లకు పైగా ఎగిసిన ఆ తరువాత సెన్సెక్స్ 641 పాయింట్ల లాభంతో 52239 వద్ద, నిఫ్టీ 200 పాయింట్ల లాభంతో 15550 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. జాతీయం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ లాభాలు ఎంతవరకు కొనసాగుతాయనేది చూడాల్సి ఉంది. ఒక్క ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ మినహా అన్ని రంగాల షేర్లలోనే కొనుగోళ్లు […]
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 9,923 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారంతో పోలిస్తే ఇవాళ 22.4శాతం కేసులు తగ్గినట్లు వెల్లడించింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,33,19,396కు చేరింది. మరో 17 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటివరకు కరోనా బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 5,24,890కు పెరిగింది. కొత్తగా 7,293మంది రోగులు కోలుకున్నారు. వారితో కలిపి మొత్తం […]
మరోసారి రాష్ట్రపతి పదవికి అభ్యర్థి కోసం ప్రతిపక్షాల వేట ప్రారంభమైంది. ఢిల్లీలో ఇవాళ మరోసారి విపక్ష నేతలు సమావేశం కానున్నారు. ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేసేందుకు విపక్షాలు మరోసారి భేటీ కానున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో 17 ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరుకానున్నారు. ఇక మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు మంగళవారం నాటి భేటీకి తాను హాజరవుతున్నట్లు ఆ పార్టీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ వెల్లడించారు. ఉత్కంఠగా సాగుతుందునుకున్న రాష్ట్రపతి […]
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఒకరోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతున్నాయి. సోమవారం స్థిరంగా ఉన్న ధరల్లో మంగళవారం స్వల్ప పెరుగుదల నమోదైంది. తాజాగా 10 గ్రాముల బంగారంపై 100 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 నుంచి రూ.47,750కి పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980 నుంచి రూ.52,080కి చేరింది. బంగారం ధరలు పెరిగేందుకు పలు అంశాలు ప్రభావితం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. […]
శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఆ దేశ ప్రభుత్వం పలువిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. చమురు నిల్వలు వేగంగా పడిపోతుండడంతో వాటిని ఆదా చేసేందుకు అత్యవసరం కానీ సేవలను సోమవారం నుంచి రెండు వారాలు నిలిపివేసింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రపు సిబ్బందితో పనిచేస్తున్నాయి. ఆస్పత్రులు, కొలంబో నౌకాశ్రయం మాత్రం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. పెట్రోల్ పంపుల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నాయి. మరోవైపు శ్రీలంకలో ఆర్థిక […]
విడాకులు తీసుకుంటున్న సంపన్న జంటల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, అమెజాన్ ఛైర్మన్ జెఫ్ బెజోస్ బాటలోనే మరో కుబేరుడు భార్యతో తెగదెంపులకు సిద్ధమయ్యారు. ఇప్పుడు అదే బాటలో గూగూల్ సహ వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్ (48)-నికోల్ షనాహన్ (37)జంట విడాకులకు సిద్ధమైంది. ఈ మేరకు సెర్రీ బ్రిన్ కోర్టులో విడాకుల పిటిషన్ కూడా దాఖలు చేశారు. పరస్పర విరుద్ధ అభిప్రాయాలు కారణంగానే విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్టు ఈ జంట పేర్కొంది. సెర్జీ-నికోల్ 2018లో వివాహం […]
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సోమవారం నాలుగోరోజు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. దాదాపు 12 గంటలపాటు ఈడీ ఆయనను సుదీర్ఘంగా విచారించింది. జూన్ 13, 14, 15 తేదీల్లో రాహుల్‌ను 30 గంటలకు పైగా ఈడీ లోతుగా విచారించడం తెలిసిందే. గత వారంలో వరుసగా మూడు రోజులు ఈడీ ప్రశ్నల పరంపరను ఎదుర్కొన్న రాహుల్.. సోమవారమూ హాజరయ్యారు. ఉదయం 11 గంటల సమయంలో ఈడీ ప్రధాన కార్యాలయానికి రాహుల్ […]