సోనూసూద్ ఆస్తులపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయ్. వరుసగా మూడో రోజు…తనిఖీలు చేశారు. ముంబైలోని నివాసంతోపాటు.. నాగ్‌పూర్, జైపూర్‌లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. పెద్ద మొత్తంలో పన్ను ఎగ్గొట్టినట్లు ఐటీ అధికారులు లీకులు ఇస్తున్నారు. సోనుసూద్ ఛారిటీ ఫౌండేషన్ బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. లక్నోలోని ఓ స్థిరాస్తి సంస్థతో సోనూసూద్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సంస్థపై పన్ను ఎగవేత ఆరోపణలు ఉన్నాయ్. అందుకే సోనుసూద్ ఇంట్లో సర్వే చేసినట్లు ఐటీ అధికారులు చెప్పారు.
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నిర్మల్ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసిన ఆయన… మజ్లిస్ పార్టీకి భయపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు అమిత్ షా. నిర్మల్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా.. కేసీఆర్‌ను టార్గెట్ చేశారు. అధికారం కారుదే అయినా.. స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమన్నారు.తెలంగాణలో బీజేపీ బలం అంతకంతకూ […]
సీఎం కెసిఆర్ తాగు బోతులకు… కేటీఆర్ డ్రగ్స్ వాడే వాళ్లకు అంబాసిడర్ అని.. డ్రగ్స్ కేసులో పిలుస్తున్న హీరో లకు డ్రామా రావు దోస్తు కాదా ? అని నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఇవాళ దళిత గిరిజన దండోరా సభలో పాల్గొన్న రేవంత్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సన్నాసులు గజ్వెల్ రండి చూసుకుందాం అన్నారని… 2 లక్షలు మంది కాంగ్రెస్ కార్యకర్తలు గజ్వెల్ గడ్డ మీద కదం తొక్కారన్నారు. స్వేచ్ఛ, […]
దేవాదాయశాఖలో ఆయనో సీనియర్ ఆఫీసర్. పదేళ్లకుపైగా సర్వీస్. రేపో మాపో పదోన్నతి దక్కుతుందన్న తరుణంలో.. చేస్తున్న కొలువుకు ఆయన ఓ దణ్ణం పెట్టేశారు. అదీ అవమాన భారం భరించలేక. ఇంతకీ ఎవరా అధికారి…!!?. ఆయన కలతకు కారణం ఏంటి…!?. ఇసుక దాడి వివాదంలో మరో ట్విస్ట్! గుర్తుందా విశాఖ దేవాదాయశాఖ కార్యాలయంలో కూర్చున్న ఓ అధికారిపై ఓ మహిళా ఉద్యోగి ఇసుక వేయడం. అదీ సీసీ కెమెరాలో రికార్డ్ కావడం.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడం.. ఆ వ్యవహారం […]
అధికారపార్టీలో ఆయనో సీనియర్ ఎమ్మెల్యే. అధినాయకుడి ఫ్యామిలీకి వీరవిధేయుడు. అలాంటి శాసనసభ్యుడికి హైకమాండ్ ఓ ఆఫర్ ఇచ్చింది. పిలిచి పదవిస్తే ససేమిరా అన్నారు. ఆఫర్ తిరస్కరించి కొత్త చర్చకు తెరతీశారు. ఇంతకూ ఎవరా ఎమ్మెల్యే? అధిష్ఠానం ఇచ్చిన అవకాశం ఏంటి? తనకు టీటీడీ పదవా అని పెదవి విరిచారట!ఎమ్మెల్యే అసంతృప్తితో పార్టీ పునరాలోచన? తిరుమల శ్రీవారి సేవాభాగ్యం కోసం రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు పోటీపడుతుంటారు. ట్రస్ట్ బోర్డ్ సభ్యుడిగా ఒక్కసారైనా పనిచేయాలని కలలు కంటారు. సుదీర్ఘ […]
ఆయనో కేంద్ర మాజీ మంత్రి. 30 ఏళ్ల రాజకీయ అనుభవం. అలాంటి పెద్దాయన ‘మనసు…గాయపడింది. తాడేపేడో తేల్చేయాలని నిర్ణయించుకున్నారట. రూట్ మార్చి లేఖల యుద్ధం ప్రారంభించారు. ఇంతకీ ఆయన ‘పోరాటం’ ఫలిస్తుందా!? ఇప్పుడు రోజూ వార్తల్లో వ్యక్తి అయ్యారు! అశోక్ గజపతిరాజు. టీడీపీ సీనియర్ నేత. పార్టీలో కూడా ఆయన్ను రాజుగానే ట్రీట్ చేసేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన ప్రముఖంగా కనిపించేవారు. అది కూడా అధికారిక కార్యక్రమాల్లో మాత్రమే. కేంద్రం, రాష్ట్రంలో ఎక్కడైనా సరే […]
గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై అధికారులతో మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మేయర్ విజయలక్ష్మి, సీపీ అంజనికుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. దేశంలోనే హైదరాబాద్ లో జరిగే వేడుకలు ప్రత్యేకమని… అన్ని శాఖలు నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు చేశాయన్నారు. ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని.. దాదాపు 40 కి పైగా క్రేన్స్ ట్యాంక్ బండ్ లో ఏర్పాటు చేసామని తెలిపారు. 19 వేల మంది పోలీస్ […]
ఉద్యోగం పురుష లక్షణం అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆగ, మగ అనే తేడా లేకుండా పోలోమంటూ అందరూ ఉద్యోగాలు చేసేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మగవాళ్ల సంపాదన కంటే ఆడవాళ్లే సంపాదన ఎక్కువైంది. ఉన్నత స్థానాల్లో సత్తా చాటుతున్నారు. ఇంటా, బయటా వారికి ఎదురులేకుండా పోతుంది. దీంతో వారి ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు మహిళల చేతిలో నాలుగురాళ్లు ఉంటే చీరలు, షాపింగులకే ఎక్కువ ఖర్చు చేసేవాళ్లు. కానీ ఇప్పుడంతా ట్రెండ్ మారింది. మగవాళ్లతో ధీటుగా […]
దూకుడు రాజకీయాలకు రేవంత్ రెడ్డి పెట్టింది పేరు. ఆ వ్యక్తిత్వమే ఆయన్ను రాజకీయంగా ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టింది. కాంగ్రెస్ లో ఎంతమంది హేమాహేమీలున్నా వారందరినీ కాదని కాంగ్రెస్ పార్టీ అతడికి టీపీసీసీ కట్టబెట్టింది. ప్రజల్లో ఆయనకు ఉన్న మాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం ఉంది. అయితే ఈ దూకుడే ప్రస్తుతం ఆయన కొంప ముంచేటట్లు కన్పిస్తుంది. ముందువెనుక చూసుకోకుండా ఆయన సొంత పార్టీ నేతపై చేసిన విమర్శలు ఆయనకు […]
సీఎం కెసిఆర్ రాజకీయ జీవితం సమాధి చేస్తామని….కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమికొడతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరికి భయపడేది లేదని… అధికారంలోకి వచ్చాక అధికారికంగా నిర్వహిస్తామన్నారు. తెలంగాణ పౌరుషం ఉంటే టిఆర్ ఎస్ ఎమ్మెల్యే లు కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలని… ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ ను కేసీఆర్ మూడు ముక్కలు చేశారు, ఒక ముక్కను ఎంఐఎం కు ఇచ్చారని మండిపడ్డారు. విమోచన దినోత్సవాన్ని ఎందుకు […]