సీఎం జగన్ వైపు కన్నెత్తి చూసినా.. లోకేష్ తాట తీస్తామని హెచ్చరించారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్. ఒక అడుగు వేస్తే తాటి మట్టలతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని… ఇది ఆరంభం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. అయ్యన్నపాత్రుడు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయని… ఇటువంటి వ్యక్తులను చంద్రబాబు ప్రోత్సాహిస్తున్నాడా ? అని నిలదీశారు. చంద్రబాబుకు నిరసన చెప్పటానికి వెళితే నా పై దాడి చేశారని… చంద్రబాబు నోటిని ఫినాయిల్ తో కడగాలని నిప్పులు చెరిగారు. […]
తాలిబన్లు అఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకున్నాక పరిస్థితులన్నీ తలకిందులుగా మారిపోయాయి. అప్ఘన్లో ఎక్కడ చూసినా.. ఎవరినీ కదిలించినా హృదయ విదారక సంఘటనలే దర్శనమిస్తున్నాయి. తమ దేశంలోనే పరాయివాళ్లలా పొట్టచేత బట్టుకొని జీవించాల్సిన దుస్థితి అప్ఘన్లకు రావడం నిజంగా శోచనీయమనే చెప్పాలి. తాలిబన్ల చెర నుంచి తమను రక్షించాలని నిస్సాహాయ స్థితిలో అఫ్ఘన్లు ప్రపంచ దేశాల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గతానికి భిన్నంగా తమ పాలన ఉంటుందని తాలిబన్లు […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. అయితే రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 60,350 శాంపిల్స్ పరీక్షించగా… 1,393 మందికి పాజిటివ్‌గా తేలింది… మరో 08 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 1,296 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, తాజా కేసులతో కలుపుకొని.. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,36,179 కు చేరగా.. 20,07,330 […]
రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియామకం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ సిజే అరూప్ కుమార్ గోస్వామి.. ఛత్తీస్ గఢ్ కు బదిలీ కాగా… ఛత్తీస్ గఢ్ ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆంధ్రప్రదేశ్ సిజే గా బదిలీ అయ్యారు. ఇక తెలంగాణ హైకోర్టు కు ప్రధాన న్యాయమూర్తి నియామకం అయ్యారు. కర్ణాటక హైకోర్టు యాక్టింగ్ సిజేగా ఉన్న సతీష్ చంద్ర శర్మ ను తెలంగాణ సిజేగా బదిలీ అయ్యారు. కొలీజియం సిఫారసు మేరకు తెలుగు […]
బసవతారం కేన్సర్ ఆస్పత్రి లో ఇవాళ మరో మరో మణిపూస చేరిందని… నటుడు, ఆ ఆస్పత్రి చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ లోని బసవతారకం ఇండో-అమెరికన్ కేన్సర్ ఆసుపత్రిలో డిజిటల్ రేడియోగ్రఫీ సదుపాయాన్ని శుక్రవారం బాలకృష్ణ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రేడియాలజీ విభాగంలో ఇప్పటికే 3డీ డిజిటల్ మమ్మోగ్రామ్ ఉందని, కొత్తగా డిజిటల్ రేడియోగ్రఫీని కూడా అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. ఈ డిజిటల్ రేడియోగ్రఫీ ఎంతో వేగవంతమైనదని తెలిపారు. సాధారణంగా ఫిల్మ్ […]
మనిషి మనుగడకు మొక్కలు తప్పనిసరి అని, మానవ జీవితంలో అతిగొప్ప పని మొక్కలు నాటడమేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. మొక్కలు పెంచాలి, పర్యావరణాన్ని కాపాడాలి అన్న ఆచరణ స్పూర్తితో తెలంగాణ ప్రభుత్వం ముందకుసాగుతుందని అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పర్యావరణానికి సంబంధించి వినూత్నంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్, తెలంగాణ హరితహారం కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించే కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఉద్యమాన్ని నిక్షిప్తం చేసిన “మట్టి చిగురు ” పుస్తకాన్ని […]
న్యూజిలాండ్, పాక్ క్రికెట్ జట్ల మధ్య జరగాల్సిన టూర్ పూర్తి గా రద్దైంది. ఇవాళ పాక్ లోని రావల్పిండి స్టేడియం లో మొదటి వన్డే.. ఇవాళ రద్దు అయింది. భద్రతా సమస్యల కారణంగా ఇరు జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ రద్దు అయింది. అయితే.. మొదటి మ్యాచ్ రద్దు అయినట్లు ప్రకటించిన కొద్ది సేపటి క్రితమే.. పాక్ టూర్ ను కూడా పూర్తి గా రద్దు చేసుకుంటున్నట్లు.. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు పేర్కొంది. భద్రతా సమస్యల […]
ఢిల్లీ : ప్రధానమంత్రి మోడీ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకు లేఖ రాశారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ధర్మ సంస్థాపన కోసం ఈ యుగం లో జన్మించిన వ్యక్తి మోడీ అని… చెడ్డా వారిని శిక్షించే బాధ్యత మోడీ దేనన్నారు. కోర్టులో మా ప్రభుత్వానికినిన్న రెండు మొట్టికాయలు పడ్డాయని… కనక రాజ్ ను పోలీస్ కంప్లైంట్ ఆథారీటీ చైర్మన్ గా నియామకం, రంగుల విషయములో కోర్టు తప్పుపట్టిందని తెలిపారు. సుప్రీమ్ కోర్ట్, హై కోర్ట్ […]
దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చాక ప్రతీఒక్కరికి ఆరోగ్యం గురించిన అవశ్యకత తెలిసొచ్చింది. సీఎం జగన్మోహన్ రెడ్డి తొలి నుంచి కూడా ప్రజా ఆరోగ్యం విషయంలో శ్రద్ధ కనబరుస్తూనే ఉన్నారు. గతంలో ఒకేరోజు వెయ్యి అంబులెన్సులను ప్రారంభించి జగన్మోహన్ రెడ్డి సర్కార్ రికార్డు సృష్టించింది. వెయ్యి రూపాయాల కంటే ఎక్కువ ఖర్చు చేసే వ్యాధులన్నింటిని ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చి పేద, సామాన్య ప్రజలకు బాసటగా నిలిచింది. ఆఖరికి కరోనా ట్రీట్మెంట్ ను సైతం సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీలో […]
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ “గల్లీ రౌడీ”. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా ‘గల్లీ రౌడీ’ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఎంవివి సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌లపై ఎంవివి సత్యనారాయణ, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించారు. ఇక థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. […]