రాజకీయాల్లో తండ్రి ఓ వెలుగు వెలిగితే.. తనయుల పొలిటికల్ భవిష్యత్‌కు ఢోకా ఉండదు. కానీ.. ఆ వారసుడికి మాత్రం సీన్ రివర్స్. వారసుడి గత చరిత్రను ఇప్పటికీ మర్చిపోలేకపోతోంది పార్టీ కేడర్. నేను మారిపోయాను బాబోయ్ అని.. ఆయన నెత్తీనోరు కొట్టుకుని చెబుతున్నా విశ్వసించడం లేదట. దాంతో ఆయనకు పార్టీ ఛాన్స్ ఇస్తుందో లేదో అని చర్చ మొదలైంది. ఇంతకీ ఎవరాయన? సత్తెనపల్లి టీడీపీ ఇంఛార్జ్ పదవి కోసం కోడెల శివరామ్ యత్నం! కోడెల శివరామ్. మాజీ […]
తిరుమల శ్రీవారి ఆలయంలో 5 నెలలుగా నిలిచిన సర్వదర్శనం సడెన్‌గా ఎలా ప్రారంభమైంది? టీటీడీ ప్రయోగాత్మక పరిశీలన కూడా పూర్తికాని.. సంప్రదాయ భోజన పథకం ఎందుకు ఆగిపోయింది? ఈ రెండు నిర్ణయాల వెనక ఉన్నది ఎవరు? టీటీడీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తిరుమలలో ఆగమశాస్త్రానికే పెద్దపీట..! కలియుగ వైకుంఠనాధుడి సన్నిధిలో చిన్నపాటి మార్పులు చేయాలంటే ఎన్నో అడ్డంకులు దాటాలి. మరేన్నో వివరణలు ఇచ్చుకోవాలి. అధికారులకు నచ్చిందనో.. పాలకమండలి మెచ్చిందనో.. ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుని అమలుచేసే పరిస్థితి […]
సినీ నటుడు సోనూసూద్ ఇల్లు, ఆయనకు సంబందించిన కంపెనీలపై ఐటీ శాఖ సర్వే చేసింది. ముంబైలోని ఆయనకు చెందిన ఆఫీసులో కూడా తనిఖీలు చేసినట్టు సమాచారం. ముంబైలోని ఆరు ప్రాంతాల్లో ఈ సర్వే జరిగింది. ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పాఠశాల విద్యార్థుల మెంటార్ షిప్ ప్రోగ్రాంకు.. సోనూసూద్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది కేజ్రీవాల్ ప్రభుత్వం. అంతకు ముందు పంజాబ్ ప్రభుత్వంలో కూడా కరోనాపై అవగాహన కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ రెండు ప్రభుత్వాలు […]
టీడీపీపై విమర్శలు గుప్పించారు సీఎం జగన్. చంద్రబాబు వల్లే ఏ గ్రేడ్‌లో ఉన్న మహిళ సంఘాలన్నీ ‘సి’ గ్రేడ్‌లోకి పడిపోయాయన్నారు. గత ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి…చేతులెత్తేసిందన్నారు. రుణాలు కట్టొద్దని పిలుపునిచ్చి మహిళలను మోసం చేసిందని ఆరోపించారాయన. వడ్డీలు చెల్లించలేక తడిసి మోపెడయ్యాయని, 2014లో చంద్రబాబు మహిళల రుణాలను మాఫీ చేసి ఉంటే అక్కడితో భారం పోయేదన్నారు జగన్. డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని పాదయాత్రలో కోరారని అందుకే ఆసరా, చేయూత పథకాలను తెచ్చామన్నారు. […]
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం అయిన తర్వాత కాంగ్రెస్ లో కొత్త జోష్ వచ్చేసింది. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా ఆయన రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తున్నారు. దళిత, గిరిజన దండోరా పేరుతో పలు జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇదే ఊపులో ఆయన టీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ ముందుకెళుతున్నారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో శాంతిభద్రలు లోపించాయని.. హైదరాబాద్ డ్రగ్స్ మాఫియాకు కేరాఫ్ […]
ఆ ఇద్దరూ మనసు మార్చుకున్నారా..? చాలా రోజుల తర్వాత.. గాంధీభవన్ వైపు వ్యూహాత్మకంగా అడుగులు వేశారా? వచ్చి.. అందరినీ అవాక్కయ్యేలా చేశారా? ఇకపై కలిసి నడవాలని డిసైడ్ అయ్యారా? ఎవరు వారు? ఏమా కథ? చాలా గ్యాప్ తర్వాత గాంధీభవన్‌కు వీహెచ్! తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి వచ్చాక కాంగ్రెస్‌లో కొందరు సీనియర్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. నిత్యం ఏదో ఓచోట పార్టీ కార్యక్రమాల్లో కనిపించే వి హన్మంతరావు సైతం గాంధీభవన్‌కు రాలేదు. కానీ.. […]
ప్రముఖ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ జయలలిత బయోపిక్ ‘తలైవి’ తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ విడుదలైంది. మంగళవారం రాత్రి ఆ చిత్రాన్ని చూసిన బాలీవుడ్ నిర్మాత, సీనియర్ నటుడు జితేంద్ర కుమార్తె ఏక్తా కపూర్ ‘తలైవి’ చిత్ర యూనిట్ ను పొగడ్తలతో ముంచెత్తింది. విజయ్ దర్శకత్వ ప్రతిభతో పాటు అరవింద్ స్వామి, రాజ్ అర్జున్, మధుబాల తమ పాత్రలను అద్భుతంగా పోషించారని చెప్పింది. తెరపై తనకు కంగనా రనౌత్ కాకుండా జయలలిత మాత్రమే […]
ఆర్య, ఆండ్రియా, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘అరణ్మనై-3’. ఈ సినిమా మొదటి రెండు భాగాలు తెలుగులోనూ డబ్ అయ్యి విడుదలయ్యాయి. సుందర్ సి దర్శకత్వంలో ఆయన భార్య ఖుష్బూ నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 14న విడుదల కాబోతోంది. ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ‘అరణ్మనై-3’ షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తయినా, కరోనా పేండమిక్ సిట్యుయేషన్ కారణంగా దీని విడుదలను దర్శక నిర్మాతలు […]
విజయవాడ : బిగ్ బాస్ షో పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర స్థాయి లో మండిపడ్డారు. అది బిగ్ బాస్ షో కాదని… బ్రోతల్ హౌస్ లా ఉందని ఫైర్ అయ్యారు. యువతీ యువకును గదిలో బంధించి ఏం చేయిస్తున్నారని… వినోదం పేరుతో వికృత చేష్టలను ఎలా సమర్ధిస్తామని ప్రశ్నించారు. నేటి యువతరానికి ఎటువంటి మసేజ్ లు ఇస్తున్నారని… ప్రజలు ఆదరిస్తున్నారు కదా అని… ఇష్టం వచ్చినట్లు చేస్తారా ? అని నిప్పులు చెరిగారు. […]
భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు మోడీ శకం నడుస్తోంది. అయితే రాష్ట్ర స్థాయిలో పార్టీ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ప్రధాని మోడీ ప్రస్తుతం దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేత. మరోవైపు, రాష్ట్రాలలో అధికారం నిలబెట్టుకోవడానికి కష్టపడాల్సి వస్తోంది. అందుకే ఇప్పుడు మోడీ, షా జోడీ వాటిపై ఫోకస్ పెట్టింది. రోగం ముదరకుండా జాగ్రత్త పడుతోంది. ఏకంగా ముఖ్యమంత్రులనే మారుస్తూ ట్రీట్‌మెంట్ మొదలు పెట్టింది. మోడీ హయాంలో సీఎంల ఎంపిక తాజా రాజకీయ ట్రెండ్‌కు భిన్నం. ముఖ్యమంత్రి […]