బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పీకింది ఏమీ లేదని… కేంద్రంలో కూడా పీకింది ఏమీ లేదన్నారు. ప్రధాని వద్దకు పోయి నిధుల సంగతి తేలుద్దామా? తెలంగాణకు అన్యాయం జరుగుతుందని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఒకవేళ తప్పయితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా? అని కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. దేశంలో 78 కోట్ల మందికి ఉచిత వ్యాక్సిన్ కేంద్రం […]
హారర్ కామెడీ చిత్రాలు తాప్సీ కి కొత్త కాదు. ఆమె తెలుగులో నటించిన ‘ఆనందో బ్రహ్మ’ చిత్రం చక్కని విజయాన్ని సాధించింది. బహుశా ఆ నమ్మకంతోనే కావచ్చు. తాప్సీ తమిళంలో ‘అనబెల్ అండ్ సేతుపతి’ చిత్రంలో నటించడానికి అంగీకరించింది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సైతం ఇందులో ఓ ప్రధాన పాత్ర పోషించడం ఆమె అంగీకారానికి మరో కారణం కావచ్చు. కానీ ఇటు విజయ్ సేతుపతి, అటు తాప్సీ ఇద్దరూ ఈ సినిమాను గట్టెక్కించలేకపోయారు. ఈ సినిమా […]
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. అయితే రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 55, 525 శాంపిల్స్ పరీక్షించగా… 1174 మందికి పాజిటివ్‌గా తేలింది… మరో 09 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 1,309 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, తాజా కేసులతో కలుపుకొని.. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,37, 353 కు […]
ఏపీ ఫైబర్ నెట్ కేసు దర్యాప్తు లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఆర్టీఎస్ అధికారి సాంబశివరావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సాంబశివరావును గత ఐదు రోజులుగా విచారిస్తున్నారు. సాంబశివరావు గతంలో ఏపీ ఫైబర్ నెట్ ఎండీ గా వ్యవహరించిన సమయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫైబర్ నెట్ తొలి దశలో రూ. 320 కోట్ల టెండర్లలో రూ.. 121 కోట్ల అవినీతిని సీఐడీ గుర్తించింది. ఎండీ […]
టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై పీసీసీతోపాటు కేడర్ కూడా క్షేత్రస్థాయిలో గురి పెట్టిందా? అందుకే సడెన్‌గా ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాలకు భద్రత పెంచారా? కేసులు పెడుతున్నా.. కాంగ్రెస్ కేడర్ ఎందుకు దూకుడుగా వెళ్తోంది? ఈ వైఖరి ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌కు వర్కవుట్ అవుతుందా? పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ కేడర్ గురి..! ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కసారిగా కాంగ్రెస్ గేర్ మార్చి దూకుడు పెంచింది. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవగా.. కాంగ్రెస్ […]
మూడు ప్రముఖ ఆలయాల ఛైర్మన్ గిరి పట్టేశారు. కానీ.. ఆనందం ఆవిరైంది. స్థానిక నినాదం వాళ్లను ఆ పదవులు చేపట్టకుండా చేసింది. స్థానికేతర నినాదం కాస్త గట్టిగానే తాకడంతో హైకమాండ్ కూడా పునరాలోచనలో పడింది. టోటల్‌గా పదవులు వచ్చి.. పదవులు చేపట్టని వారిగా ఆ ముగ్గురూ మిగిలిపోయారు. ఆలయాల పదవులపై స్థానిక నేతల గుర్రు! చిత్తూరు జిల్లాలో నామినేటెడ్ పోస్టుల వ్యవహారం కాక రేపుతూనే ఉంది. జిల్లాలో ముగ్గురు వైసీపీ నేతలు శ్రీకాళహస్తి, కాణిపాకం సహా కర్నూలు […]
ఢిల్లీస్థాయి నాయకులు హైదరాబాద్ వస్తుంటే ఇన్నాళ్లూ బీజేపీ నాయకులు టెన్షన్ పడేవారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతల వంతు వచ్చింది. రాష్ట్రంలో టీఆర్ఎస్‌తో యుద్ధం చేస్తున్న సమయంలో హస్తిన నుంచి వచ్చి ప్రశంసలు కురిపించడం స్థానిక నేతలకు చిర్రెత్తికొస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో అలాంటి గొడవే హైకమాండ్ వరకు చేరి పెద్ద చర్చగా మారి.. రచ్చ రచ్చ అవుతోంది. శశిథరూర్ కామెంట్స్ రచ్చలో అనేక మలుపులు తెలంగాణలో విచిత్రమైన రాజకీయ పరిస్థితి. రాష్ట్ర బీజేపీ నేతలు trsని టార్గెట్ చేస్తే.. […]
అమరావతి : అయ్యన్నపాత్రుడు సమాజానికి పట్టిన చీడ అని.. అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని.. హోమ్ మంత్రి మేకతోటి సూచరిత ఫైర్ అయ్యారు. దళిత హోం మంత్రిగా సీఎం జగన్ నాకు అవకాశం కల్పించడం టీడీపీ నేతలకు రుచించడం లేదని… అయ్యన్నపాత్రుడు తనపై చేసిన వ్యాఖ్యలకు బాధ పడుతున్నాని తెలిపారు. దళిత మహిళకు ఉన్నత పదవి ఇవ్వడం అయ్యన్నపాత్రుడుకు నచ్చడం లేదా ? అయ్యన్న పాత్రుడు సంస్కార హీనంగా మాట్లాడారని నిప్పులు చెరిగారు. […]
ఏపీ సీఎం జగన్ పై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఇవాళ చంద్రబాబు ఇంటి దగ్గర ఘటనపై లోకేష్ నిప్పులు చెరిగారు. ప్రతిపక్షనేత ఇంటిపైకి ఎమ్మెల్యేను పంపి… సీఎం జగన్ తన స్థాయిని దిగజార్చుకున్నాడని… దీన్ని బట్టి ఆయన ఎంత వణికిపోతున్నాడోనని లోకేష్ పేర్కొన్నారు. “జగన్ వి గాలి హామీలు అని తేలిపోయాయి. ముద్దులు పిడిగుద్దుల్లా పడుతున్నాయి. జగన్‌ది అంతా నాటకమనీ జనానికి తెలిసిపోయింది. జనం తిరగబడే రోజు దగ్గరపడిందని, ఉలిక్కిపడి ప్రతిపక్షంపైకి వాళ్లనీ,వీళ్లనీ పంపడం ఎందుకు? […]
వరంగల్ కాకతీయ వైద్యకళాశాలలో ర్యాగింగ్ భూతం బుసలు కొట్టింది. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా, అధికారులు ఆంక్షలు విధించినా.. ర్యాగింగ్ కొనసాగుతోంది. జాతీయ కోటాలో సీటు సాధించిన మొదటి సంవత్సరం విద్యార్థిని.. తృతీయ సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు, బట్టలూడదీసి ర్యాగింగ్ చేయడం కలకలం రేపింది.బాధిత విద్యార్థి.. సీనియర్ల ర్యాగింగ్ చేసిన విషయాన్ని, రాజస్థాన్‌లో ఉన్న తమ కుటుంబసభ్యుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వారు వైద్యకళాశాలకు వచ్చి, ర్యాగింగ్ చేసిన విద్యార్థులతో మాట్లాడారు. మరోవైపు.. రాష్ట్ర వైద్యశాఖ […]