సోనూసూద్ ఆస్తులపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయ్. వరుసగా మూడో రోజు…తనిఖీలు చేశారు. ముంబైలోని నివాసంతోపాటు.. నాగ్‌పూర్, జైపూర్‌లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. పెద్ద మొత్తంలో పన్ను ఎగ్గొట్టినట్లు ఐటీ అధికారులు లీకులు ఇస్తున్నారు. సోనుసూద్ ఛారిటీ ఫౌండేషన్ బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. లక్నోలోని ఓ స్థిరాస్తి సంస్థతో సోనూసూద్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సంస్థపై పన్ను ఎగవేత ఆరోపణలు ఉన్నాయ్. అందుకే సోనుసూద్ ఇంట్లో సర్వే చేసినట్లు ఐటీ అధికారులు చెప్పారు.