Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Murder: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వేధింపుల వివాదం ఓ యువకుడి హత్యకు దారితీసింది. రామేశ్వరం కేఫే ఎదుట భాస్కర్ అనే యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కర్రలు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో మాధాపూర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. అందిన సమాచారం ప్రకారం.. భాస్కర్ ఇద్దరు యువతులను వేధిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై గతంలో మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. అప్పట్లో పోలీసులు ఇరు వర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించినప్పటికీ భాస్కర్ ప్రవర్తనలో మార్పు రాలేదు.
ఈ మధ్యకాలంలో భాస్కర్ “దమ్ముంటే హైదరాబాద్‌కు రండి” అంటూ సవాల్ విసిరినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన యువతుల తండ్రి, మరో వ్యక్తితో కలిసి వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి పథకం ప్రకారం దాడి చేశారు. హత్య అనంతరం నిందితులిద్దరూ స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. మరోవైపు డయల్-100కు సమాచారం అందడంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read
ఘటనాస్థలికి క్లూస్ టీమ్ చేరుకుని కీలక ఆధారాలను సేకరించింది. అనంతరం భాస్కర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమ వేధింపుల వివాదమే ఈ హత్యకు కారణమా.? లేదా ఇతర కోణాలు కూడా ఉన్నాయా.? అనే దానిపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం నిందితులిద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారు.
తాజావార్తలు
-
Common Pass : హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్
-
Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
-
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?