సీఎం కెసిఆర్ తాగు బోతులకు… కేటీఆర్ డ్రగ్స్ వాడే వాళ్లకు అంబాసిడర్ అని.. డ్రగ్స్ కేసులో పిలుస్తున్న హీరో లకు డ్రామా రావు దోస్తు కాదా ? అని నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఇవాళ దళిత గిరిజన దండోరా సభలో పాల్గొన్న రేవంత్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సన్నాసులు గజ్వెల్ రండి చూసుకుందాం అన్నారని… 2 లక్షలు మంది కాంగ్రెస్ కార్యకర్తలు గజ్వెల్ గడ్డ మీద కదం తొక్కారన్నారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం నిజాం రజాకారులు ను ఇదే రోజు తరిమి కొట్టారని… మల్లన్న సాగర్ లో 60 వేలు ఎకరాలు భూమి తీసుకుని 14 గ్రామాలుని ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు.
కొండ పోచమ్మ సాగర్ లో తమ బంధువులు భూమి కాపాడడం కోసం పేదలు భూమి ని లాక్కొన్నారని… మెదక్ ప్రజలు ఆదరించి ఎంపీ చేయడం వలన ఇందిరా గాంధీ ప్రధాని అయిందని గుర్తు చేశారు. నాలుగు కోట్ల ప్రజలు విముక్తి కోసం, పార్టీ ప్రయోజనాలు వదిలేసి తెలంగాణ ఇచ్చిందని… పార్టీ ని విలీనం చేస్తానని మోసం చేసిన దగుల్బాజీ కేసీఆర్ అని నిప్పులు చెరిగారు. అర శాతం జనాభా ఉన్న కేసీఆర్ ఇంట్లో నాలుగు పదవులు ఉన్నాయని.. 12 శాతం ఉన్న మాదిగలకు మంత్రి పదవి ఇవ్వలేదని నిప్పులు చెరిగారు. ముస్లిం లకు 12 శాతం ఇస్తానని చెప్పి ఏడున్నర ఏళ్ళు అయిందని.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని తుంగలో తొక్కాడన్నారు. తెలంగాణ వచ్చిన మొదటి ఏడాది మద్యం ఆదాయం 10883 కోట్లు.. కానీ ఇప్పుడు 36000 కోట్లు ఆదాయం వస్తుందని… మద్యం ఆదాయం 300 శాతం పెరిగిందని ఆరోపించారు.