7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
REDMI Note 17: షియోమీ (Xiaomi) కొత్తగా రెడ్మీ నోట్ 17 (REDMI Note 17) స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. 7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, Qualcomm స్నాప్ డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్, AI ఆధారిత యాంటీ-ఫ్రాడ్ సెక్యూరిటీ ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. పెద్ద డిస్ప్లే, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది.
OLED డిస్ప్లే:
REDMI Note 17లో 7 అంగుళాల FHD+ OLED డిస్ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 1800 నిట్స్ బ్రైట్నెస్, DCI-P3 వైడ్ కలర్ గామట్, 5,000,000:1 కాంట్రాస్ట్ రేషియోను సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ డిస్ప్లేలో 2160Hz ఇన్స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, గ్లోవ్ మోడ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ బ్లాక్, లైట్ ఆక్వామెరైన్, మీటియర్ పర్పుల్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది.
Also Read
- Honor X8e 4G: హానర్ X8e 4G లాంచ్.. 108MP కెమెరా, 7,700mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్!
- Redmi Book 14 2027: Redmi కొత్త ల్యాప్‌టాప్‌లు వచ్చేశాయ్.. Intel Core 7 ప్రాసెసర్, 72Wh బ్యాటరీ, 120Hz డిస్ప్లే
- 6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
- Apple మొట్టమొదటిసారిగా టచ్‌స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
భారీ బ్యాటరీ:
ఈ ఫోన్లో 4nm టెక్నాలజీ ఆధారంగా రూపొందిన Qualcomm స్నాప్ డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్‌ను ఉంచారు. సాధారణ గేమింగ్, మల్టీటాస్కింగ్ పనితీరుకు ఇది అనుకూలంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. REDMI Note 17లో మెయిన్ అట్రాక్షన్ 8000mAh భారీ బ్యాటరీ. దీనిని ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుందని షియోమీ పేర్కొంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. దీంతో ఈ ఫోన్‌ను పవర్ బ్యాంక్‌లా ఉపయోగించి ఇతర డివైస్‌లను కూడా ఛార్జ్ చేయవచ్చు.
AI యాంటీ-ఫ్రాడ్:
ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 16 ఆధారిత షియోమీ హైపర్ OS 3 అందించారు. ఇందులో AI ఆధారిత యాంటీ-ఫ్రాడ్ సిస్టమ్ ప్రత్యేక ఆకర్షణ. స్కామ్ కాల్స్‌ను గుర్తించి హెచ్చరికలు ఇవ్వడం, AI డీప్‌ఫేక్ వీడియో కాల్స్‌ను రియల్ టైమ్‌లో గుర్తించడం వంటి స్మార్ట్ సెక్యూరిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీనితో పాటు బ్యాంక్ కార్డ్ యాంటీ-థెఫ్ట్ టెక్నాలజీ, రిమోట్ వైరస్ స్కానింగ్, సిస్టమ్ ఆప్టిమైజేషన్, యాప్‌ల అన్ఇన్స్టాల్ సపోర్ట్, కుటుంబ సభ్యుల కోసం రియల్‌టైమ్ లొకేషన్ షేరింగ్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
కెమెరా:
ఫోటోగ్రఫీ కోసం 50MP ప్రధాన కెమెరాతో పాటు 8MP సెల్ఫీ కెమెరా ఉంది. స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఆటమ్స్, IP65 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్, NFC, ఇన్ఫ్రారెడ్ రిమోట్, మైక్రోSD కార్డ్ సపోర్ట్, Wi-Fi 6, బ్లూటూత్ 5.1, 5G కనెక్టివిటీ వంటి ఫీచర్లు కూడా ఈ ఫోన్లో ఉన్నాయి.
ధర:
REDMI Note 17 ప్రస్తుతం చైనా మార్కెట్లో విక్రయాలకు అందుబాటులో ఉంది. భారత్‌లో ఈ ఫోన్ ఎప్పుడు విడుదల కానుందనే విషయంపై షియోమీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. వీటి ధరలు ఇలా ఉన్నాయి.
* 6GB + 128GB – 1,299 యువాన్ (రూ.18,425).
* 8GB + 128GB – 1,399 యువాన్ (రూ.19,850).
* 8GB + 256GB – 1,599 యువాన్ (రూ.22,690).
తాజావార్తలు
-
Dinesh Karthik: విరాట్, రోహిత్ కాదు… ఈ భారత యువ సంచలనమే వరల్డ్ బెస్ట్ ఓపెనర్..
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Chhattisgarh Red Sky: ఛత్తీస్‌గఢ్‌లో రక్తం రంగులోకి మారిన ఆకాశం.. దీనికి అసలు కారణం ఏంటి?
-
‘Raids for Reels’: కేఎన్ నెహ్రూ నివాసంలో సోదాలు.. ‘రీల్స్ కోసమే దాడులు’ అంటూ స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు!
-
Dasharatha Madhav: ఐఐటీ ర్యాంక్.. గోల్డ్ మెడల్.. టాటా ఏరో స్పేస్‌లో జాబ్.. చివరకు నటుడిగా!
ట్రెండింగ్
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!