Nuvvu Naaku Nachav Re-Release: టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరైన దగ్గుపాటి వెంకటేశ్ సినీ కెరీర్‌లో అల్ టైం క్లాసిక్ లలో ఒకటిగా నిలిచినా వినోదాత్మక, కుటుంబ కథా చిత్రంగా నిలిచిన సినిమా ‘నువ్వు నాకు నచ్చావ్’. 2001 సెప్టెంబరు 6న విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. విక్టరీ వెంకటేశ్‌లోని కామెడీ కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన ఈ చిత్రం, తెలుగు సినిమా చరిత్రలో అలా నిలిచిపోయింది. అయితే ఈ ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా ఇప్పుడు 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 4K హంగులతో తిరిగి థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాను 2026 నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేయనున్నట్లుగా నిర్మాత స్రవంతి రవికిశోర్ ప్రకటించారు.
CMR Shopping Mall: రాజాంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ 44వ స్టోర్ ఘన ప్రారంభం..
ఈ సందర్భంగా నిర్మాత స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ.. “కొత్త సంవత్సరాన్ని కుటుంబంతో కలిసి నవ్వులు పూయిస్తూ ప్రారంభించడానికి ఇదే సరైన సమయం. ఇన్నేళ్లుగా రకరకాల మాధ్యమాల్లో ఆస్వాదిస్తున్న ఈ చిత్రాన్ని, ఇప్పుడు 4K హంగులతో పరిపూర్ణంగా ఆస్వాదించండి” అని అన్నారు. అప్పట్లో ఈ సినిమా విదేశాల్లో పూర్తి స్థాయిలో విడుదల కాలేదు. అందుకే ఆ లోటును భర్తీ చేసేందుకు ఈసారి దీన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నాం అని రవికిశోర్ చెప్పారు. దీంతో పాటు ఆస్ట్రేలియా, యూరప్, యూకే వంటి దేశాల్లోని తెలుగు ప్రేక్షకులు 25 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ అనుభూతిని వెండితెరపై ఆస్వాదించనున్నారు.
End of Year Sale: ఇయర్ ఎండ్ సేల్.. ప్రతి వస్తువుపై 70 శాతం వరకు తగ్గింపు..
అప్పట్లో రూ. 7.24 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా, ఫుల్ రన్ ముగిసేసరికి రూ. 18.04 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇది ఆ ఏడాది మూడో అతి పెద్ద గ్రాసర్‌గా కూడా నిలిచింది. ఈ చిత్రం ఏకంగా 5 నంది అవార్డులు (ఉత్తమ కుటంబ కథా చిత్రం, బెస్ట్ డైలాగ్ రైటర్ విభాగాల్లో సహా) గెలుచుకుంది. ఈ సినిమా తమిళంలో (వసీఘర), కన్నడలో (గౌరమ్మ), బెంగాలీలో (మజ్ను) రీమేక్ అయింది. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాను ఎన్నిసార్లు చూసినా కొత్తగానే అనిపిస్తుంది. మీరు కూడా కొత్త ఏడాది రోజున కుటుంబంతో కలిసి థియేటర్లలో ఈ స్ట్రెస్ బస్టర్ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.
A story that made generations smile and continues to touch hearts across ages! ❤️
A True Masterpiece in Telugu cinema, #NuvvuNaakuNachav returns with a theatrical re-release on Jan 1st, 2026!
A #Trivikram Writings.
Overseas Release by @PrathyangiraUS @VenkyMama… pic.twitter.com/RvFCMZOa0j
— Sri Sravanthi Movies (@SravanthiMovies) December 14, 2025