ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ.. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామన్నారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఓటు ఒక చోటే ఉండాలని కోరామని చెప్పుకొచ్చారు. కొంత మందికి తెలంగాణ, ఏపీ రెండు చోట్లా ఓట్లు ఉన్నాయి.. ఇలాంటి వాటిని వెరిఫై చేసి చర్యలు తీసుకోవాలని విఙప్తి చేశామని ఆయన చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాము ఓడిపోవడం ఖాయం అని టీడీపీ, జనసేనకు తెలుసు.. అందుకే ఓట్లు తొలగిస్తున్నారని మా మీద బురద చల్లుతున్నారు.. ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తికి ఒక ఓటు ఉండాలి అంటూ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు.
Read Also: USA: ఇతర మహిళల్ని చూస్తున్నాడని.. బాయ్‌ఫ్రెండ్ కంటిని పొడిచేసిన ప్రేయసి..
ఇక, మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. వైసీపీ నిబద్దత ఉన్న పార్టీ.. గతంలోనూ ఎన్నికల సమయంలో 16 లక్షలకు పైగా డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని తెలిపాం.. ఎన్నికల నియమావళి ప్రకారం ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి.. తెలంగాణలో రేపటి ఎన్నికలు అయిన వెంటనే మళ్ళీ ఏపీకి వచ్చి ఓట్లు వేయటానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా మూడు నెలల్లో ఓటు వేయటానికి వచ్చే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరాం.. అధికారులకు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వాలని కోరాం.. రెండు చోట్ల ఓటు ఉన్న వారి వివరాలను పూర్తి ఆధారాలతో ఇచ్చాం.. విచారణ చేసి డూప్లికేట్ ఓట్లను ఎన్నికల సంఘం రద్దు చేయాలి అని మంత్రి మేరుగ నాగార్జున వెల్లడించారు.