కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బీజేపీ ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ఓటు వేస్తే కుటుంబ పార్టీలు సీఎం అవుతారు.. బీజేపీకి ఓటు వేస్తేనే బీసీ సీఎం అవుతాడని తెలిపారు. హుజూరాబాద్ నియోజక వర్గం నుండి ఈటల రాజేందర్ ను గెలిపించండి.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని ఆయన పేర్కొన్నారు. పేదల తరుపున మాట్లాడినందుకే.. కేసీఆర్ ఈటలపై కక్ష్య పెంచుకొని పార్టీ నుండి బయటకి పంపారు అంటూ అమిత్ షా సంచలన ఆరోపణలు చేశారు.
Read Also: UP CM Yogi Adityanath: భక్తులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కార్తీక పౌర్ణమి సందేశం
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఒప్పందం జరిగింది అని అమిత్ షా పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా.. కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చేసేందుకు ఈ సంది చేసుకున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటే.. రాష్ట్రంలో ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్ తీసివేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి మోడీ అరవై లక్షలు కోట్ల రూపాయలు ఇచ్చింది అని చెప్పారు. రైతుల ధాన్యానికి మద్దతు ధర 3100 రూపాయలు ఇచ్చి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అని అమిత్ షా వెల్లడించారు.