అనిల్ రావిపూడి.. టాలీవుడ్ లో ఇప్పటికి వరకు ఓటమి ఎరుగని దర్శకులలో ముందు వరుసలో ఉంటారు. పటాస్ నుండి సంక్రాంతికి వస్తున్నాం వరకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ అతి తక్కువ కాలంలో స్టార్ డైరెక్టర్స్ సరసన నిలిచాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం మెగా స్టార్ చిరు హీరోగా మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు సినిమాతో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అనిల్ రావిపూడి.
Also Read : NBK 111 : మరోసారి పాట పాడబోతున్న బాలయ్య.. కన్ఫామ్ చేసిన తమన్
ఈ నేపథ్యంలో తన ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశాడు అనిల్ రావిపూడి. అందులో భాగంగా మీడియాతో మాట్లాడుతూ అనిల్ రావిపూడిపై మొదటి నుండి వస్తున్న క్రింజ్ డైరెక్టర్ అనే కామెంట్స్ పై స్పందించాడు. అనిల్ వివరణ ఇస్తూ ‘ నన్ను కొందరు ‘క్రింజ్” అని కామెంట్స్ చేస్తారు. ఆ ‘క్రింజ్’ అనే పదం నాతో పాటే ప్రయాణిస్తుంది. నేను ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి మరో పది బ్లాక్‌బస్టర్ సినిమాలు తీసినా కూడా నన్ను క్రింజ్ అనే పిలుస్తారు. కానీ అది కేవలం 10 శాతం మంది మాత్రమే. ఆ 10 శాతం మందిని నేను ఎందుకు సీరియస్‌గా తీసుకోవాలి. మిగతా 90 శాతం మంది నా సినిమాలకు సంతోషంగా టిక్కెట్లు కొంటున్నారు. నా సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే నా సినిమాలు కొన్న డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉన్నారు. నా సినిమాల నిర్మాతలు కూడా వసూళ్లతో సంతృప్తిగా ఉన్నారు. ఆ 90 శాతం మందికి నా సినిమాల నుండి నెగిటివ్ స్పందన ఇచ్చినప్పుడు మాత్రమే నేను ఆందోళన చెందాలి. సో ఆ 10 శాతం మంది గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని అన్నారు.