Weird Weather: తెలంగాణ రాష్ట్రంలో విచిత్ర వాతావరణం కొనసాగుతుంది. కొన్ని జిల్లాల్లో ఎండలు మండిపోతుండగా.. మరికొన్ని జిల్లాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. అయితే, ఒకే సారి ఎండ, వాన రావడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు.
Hyderabad: దసరా పండగకు పల్లె బాట బట్టిన ప్రజలు ఇప్పుడు తిరుగు ప్రయాణం అవుతున్నారు. పండగ సెలవులు ముగించుకుని నగరానికి తిరిగి వస్తున్న ప్రజలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతుంది. నగరానికి చేరుకుంటున్న ప్రజలు, ఉద్యోగాలకు వెళ్లడం కోసం తమ తమ ఇళ్లకు త్వరగా చేరుకోవడం కోసం తహతహలాడుతున్నారు.
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ప్రధాన పార్టీలు సన్నాహాలు రూపొందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీలు ఈ ఎన్నికను ప్రస్టేజ్గా తీసుకుని.. కమిటీలు, సబ్ కమిటీలు, సర్వేలు, సమీక్షలతో బిజీగా మారిపోగా, బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి, జోరుగా ప్రచారం కూడా చేస్తోంది. అయితే, జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థిని ఎంపిక చేయడానికి నలుగురి పేర్లను కాంగ్రెస్ ప్రతిపాదించింది.
IND vs PAK: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగింది. ఆపరేషన్ సింధూర్ తో భారత్ చేసిన దాడులను దాయాది దేశం ఎదుర్కోలేక మన ముందు మోకరిల్లింది. దీంతో అక్కడి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతునే ఉంది.
BC Reservations: తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును తీసుకొచ్చింది.
Minors’ Drug Party: రంగారెడ్డి జిల్లాలోని మొయినా బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ లో మైనర్ల మద్యం, డ్రగ్స్ పార్టీ తీవ్ర కలకలం రేపుతుంది. పెద్ద మంగళారం గ్రామంలో ఉన్న ఓక్స్ ఫామ్ హౌస్ లో మైనర్స్ ఈ డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు.
BJP MLA Katipally: బీజేపీ పదాధికారుల సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా స్థాయిలో పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.
Darjeeling Tragedy: భారీ వర్షాల కారణంగా పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలోని మిరిక్ దగ్గర కొండ చరియలు విరిగిపడి 17 మందికి పైగా మృతి చెందారు. వర్ష బీభత్సంతో కొండచరియలు విరిగిపడటంతో డార్జిలింగ్- సిలిగురి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
YS Jagan: ఏపీలో కల్తీ మద్యం అమ్మకాలపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్గా మారారంటూ ఎక్స్ వేదికగా ఆరోపణలు చేశారు.