Hyderabad: పట్నం బాట పట్టిన ప్రజలు.. కిక్కిరిసిపోయిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
- హైదరాబాద్‌కు తిరుగు పయనం అవుతున్న పల్లెవాసులు..
- దసరా పండగకు ఊరెళ్లిన వారు ఉద్యోగాలు, పిల్లల చదవు కోసం పట్నానికి రిటర్న్..
- పట్నానికి తిరిగి వస్తున్న ప్రజలకు కిటకిటలాడుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: దసరా పండగకు పల్లె బాట బట్టిన ప్రజలు ఇప్పుడు తిరుగు ప్రయాణం అవుతున్నారు. పండగ సెలవులు ముగించుకుని నగరానికి తిరిగి వస్తున్న ప్రజలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతుంది. నగరానికి చేరుకుంటున్న ప్రజలు, ఉద్యోగాలకు వెళ్లడం కోసం తమ తమ ఇళ్లకు త్వరగా చేరుకోవడం కోసం తహతహలాడుతున్నారు. ఇక, ఇదే అదునుగా తీసుకున్న ఆటో, క్యాబ్ వాలాలు ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే, సమయానికి విధులకు హాజరు కావాలని అడిగిన కాడికి సమర్పించుకుని తమ ఇళ్లకు ప్రయాణికులు చేరుకుంటున్నారు. అలాగే, పాఠశాలలు సైతం నేటి నుంచి తిరిగి ప్రారంభం అవుతుండటంతో పిల్లలు సైతం త్వరగా ఇళ్లకు చేరుకోవాలని ఆరాటపడుతున్నారు. అయితే, ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉదయం 6 గంటల నుంచి కిక్కిరిసి పోయింది. మచిలీపట్నం, నర్సాపూర్, గౌతమి, గోదావరి, చార్మినార్, చెన్నై రైళ్ల ద్వారా విశాఖపట్నం, శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ, మచిలీపట్నం తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం అయ్యారు.
Also Read
- Saidabad Steel Bridge :సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. రేపే సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్
- Tukkuguda Nurse Case: తుక్కుగూడ నర్సు కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి జాతీయ మహిళా కమిషన్
- CM Revanth Reddy : రాహుల్‌నే ప్రధాని చేయాలి.. వైఎస్సార్‌కు అదే నివాళి
- Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్‌పై సీపీ వేటు
మరోవైపు, దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లిన నగరవాసులు సెలవులు ముగియడంతో హైదరాబాద్‌కు తిరుగు పయనం అవుతున్నారు. దీంతో విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ పెరిగింది. దీంతో పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరాయి. వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకొని పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!