BC Reservations: నేడు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ.. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ!
- నేడు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణ..
- స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగానికి విరుద్ధంగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని పిటిషన్..
- సుప్రీంకోర్టులో ప్రభుత్వ వాదనలను గట్టిగా వినిపించాలని రేవంత్ రెడ్డి నిర్ణయం..
- తెలంగాణ ప్రభుత్వం, ఈసీ తరఫున వాదనలు వినిపించనున్న అభిషేక్ సింఘ్వీ, సిద్ధార్థ దవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BC Reservations: తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును తీసుకొచ్చింది. ఇక, దీనిపై హైకోర్టు స్థానిక ఎన్నికలపై ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి సెప్టెంబరు 29వ తేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారంటూ పేర్కొన్నారు. దీంతో ఈరోజు ( అక్టోబర్ 6న) బీసీ రిజర్వేషన్లపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేయనుంది.
Read Also: Sreeleela : సౌత్ క్యూటీకి బాలీవుడ్ బంపర్ ఆఫర్.. కరణ్ జోహార్ ప్రాజెక్ట్‌లో శ్రీలీల
Also Read
అయితే, సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌పై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో ప్రభుత్వ వాదనలను గట్టిగా వినిపించాలని నిర్ణయం తీసుకుంది. గత రాత్రి బీసీ మంత్రులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ప్రభుత్వం, పార్టీ పరంగా తీసుకోవాల్సిన అంశాలపై భట్టి విక్రమార్కతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింగ్వి.. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వాదించనున్నారు.
Read Also: Krithi Shetty: బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకోబోతున్న కృతి శెట్టి
ఇక, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై తీవ్ర వివాదం కొనసాగుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇంతకుముందు న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం మించకూడదని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, దాన్ని ఉల్లంఘించిన తెలంగాణ ప్రభుత్వం, బీసీలకు ఏకంగా 42 శాతం రిజర్వేషన్ల ఇవ్వడంతో, వారికి 50 శాతం మించిపోతుంది. కాబట్టి, ఇప్పుడు కోర్టు తీర్పు ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ మార్పులు జరిగే అవకాశం ఉందనే విషయం క్లియర్ గా తెలుస్తుంది.
తాజావార్తలు
-
TDP vs YCP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి!
-
Punam Raut Retires: “చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా”.. రిటైర్మెంట్ ప్రకటనపై పూనమ్ భావోద్వేగం..
-
Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
Parliament Special Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ప్లాన్?.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కసరత్తు
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!