Weird Weather: తెలంగాణ రాష్ట్రంలో విచిత్ర వాతావరణం కొనసాగుతుంది. కొన్ని జిల్లాల్లో ఎండలు మండిపోతుండగా.. మరికొన్ని జిల్లాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. అయితే, ఒకే సారి ఎండ, వాన రావడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా వర్షం పడుతున్నపుడు ఎండ ఉండదు.. ఒక వేళ ఎండ కొట్టినా కొన్ని నిమిషాల్లోనే మబ్బులు కమ్మేస్తాయి. కానీ, ఈరోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఓ వైపు వాన కురుస్తుంటే మరో వైపు ఎండకాసింది. అది కూడా గంటకు పైగా ఈ వింత పరిస్థితి నెలకొంది. దీంతో హైదరాబాద్ ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆ దృశ్యాలని కొందరు తమ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Read Also: Bollywood : యావరేజ్ బ్యూటీకి వరుస ఆఫర్లు.. ఏమి చూసి ఇస్తున్నారో
అయితే, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్ సహా సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాలో భారీగా వాన పడింది. పలుచోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని ఐఎండీ పేర్కొనింది. కాబట్టి, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు, ఇవాళ రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ మరోసారి హెచ్చరించింది. హైదరాబాద్‌తో పాటు మెదక్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నాగర్ కర్నూల్, కరీంనగర్, రంగారెడ్డి, నారాయణపేట కామారెడ్డి, మేడ్చల్- మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని. ఇక, ములుగు, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, జనగామ, హనుమకొండ, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.