Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ప్రధాన పార్టీలు సన్నాహాలు రూపొందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీలు ఈ ఎన్నికను ప్రస్టేజ్‌గా తీసుకుని.. కమిటీలు, సబ్ కమిటీలు, సర్వేలు, సమీక్షలతో బిజీగా మారిపోగా, బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి, జోరుగా ప్రచారం కూడా చేస్తోంది. అయితే, జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థిని ఎంపిక చేయడానికి నలుగురి పేర్లను కాంగ్రెస్ ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డిల పేర్లను పీసీసీ కమిటీ ఇవాళ (అక్టోబర్ 6న) అధిష్టానం (ఏఐసీసీ)కి పంపనుంది. అయితే, నేడో, రేపో.. వీరిలో నుంచి పార్టీ అభ్యర్థిని ఏఐసీసీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. బీసీలకు రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ జీఓ ఇచ్చినందుకు జూబ్లీహిల్స్ టికెట్‌ను కూడా అదే సామాజిక వర్గానికి ఇవ్వాలని అధిష్టానాన్ని టీ- కాంగ్రెస్ నేతలు కోరుతున్నట్లు సమాచారం. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లో బలమైన బీసీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు పేర్ల తెరపైకి వచ్చింది.
Read Also: PHC Doctors Agitation: కొనసాగుతున్న PHC డాక్టర్ల ఆందోళన.. ఆ ఐదు డిమాండ్లపై పట్టు..!
ఇక, వీరిలో నవీన్ యాదవ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోగా, అతడికి ఓటర్లతో మంచి పరిచయాలు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నవీన్‌కే టికెట్ దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉందని జోరుగా హస్తం పార్టీలో ప్రచారం జరుగుతుంది. మరోవైపు, అంజన్ కుమార్ యాదవ్ గతంలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఈ టికెట్ ఆశిస్తున్నారు. అయితే, రహమత్ నగర్ డివిజన్ నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున కార్పొరేటర్‌గా ఎన్నికైన సీఎన్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ డివిజన్ జూబ్లీహిల్స్ నియోజక వర్గంలోనే ఉండటంతో తనకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ నలుగురి పేర్లపై సీఎం రేవంత్ రెడ్డితో పలు దఫాలుగా ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చర్చించి.. ఆర్థిక, సామాజిక బలాబలాలను బేరీజు వేసిన తర్వాతే వీరి పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తుంది.
Read Also: Karan Johar: సెల్ఫ్ బుకింగులతో సినిమా హిట్ అవదు.. బుక్ మై షో బండారం బయట పెట్టిన కరణ్
అయితే, ఈ నలుగురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగిలిన వారంతా ఐకమత్యంతో పని చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచించినట్లు తెలుస్తుంది. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను తప్పని సరిగా గెలిపించాలని ముగ్గురు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్‌లకు ఇప్పటికే పార్టీ సమన్వయ బాధ్యతలను అప్పగించారు. వీలైనంత త్వరగా అభ్యర్థిని ఫైనల్ చేసి, జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, అభ్యర్థి ఖరారుతో సంబంధం లేకుండా ఇప్పటికే హస్తం నేతలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి ప్రజలను కలుస్తున్నారని సమాచారం. మరోవైపు, ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఇప్పటికే ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి సునీతకు టికెట్ కేటాయించి.. జోరుగా ప్రచారం చేస్తోంది. సానుభూతి అస్త్రాన్ని జోడించి.. జూబ్లీహిల్స్ ప్రజలు మాగంటి కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ నేతలు తెలియజేస్తున్నారు.
Read Also: Minor’s Drug Party: మొయినాబాద్ ఫామ్ హౌస్లో మైనర్ల గంజాయి పార్టీ..
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలున్న కమలం పార్టీ సైతం.. ఉప ఎన్నికకు సై అంటుంది. బీజేపీకి బ్రాండ్‌గా భావించే అర్బన్ ఏరియా కావడం, యువత అధికంగా ఉండటంతో.. ఉప ఎన్నికలో గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే, బీజేపీలోనూ అభ్యర్థి ఎంపిక కోసం త్రిమెన్ కమిటీ ఏర్పాటు చేయగా.. అక్టోబర్ 5న తేదీన హైదరాబాద్ లో బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ నిర్వహించింది. ఇక, బీజేపీ నుంచి రేసులో దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, ఆకుల విజయ, వీరపనేని పద్మ పేర్లను పరిశీలిస్తున్నారు. వీరిలో ఎవరి పేరునను ఫైనల్ చేస్తారన్నది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. అయితే, కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిని రంగంలోకి దించి, బీఆర్ఎస్- బీజేపీ పార్టీలకు చెక్ పెట్టాలని హస్తం నేతలు ప్లాన్ చేస్తున్నారు.