Minors’ Drug Party: రంగారెడ్డి జిల్లాలోని మొయినా బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ లో మైనర్ల మద్యం, డ్రగ్స్ పార్టీ తీవ్ర కలకలం రేపుతుంది. పెద్ద మంగళారం గ్రామంలో ఉన్న ఓక్స్ ఫామ్ హౌస్ లో మైనర్స్ ఈ డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు. పార్టీలో సుమారు 50 మంది మైనర్లు పాల్గొన్నారు. పక్కా సమాచారంతో తనిఖీలు చేసి రాజేంద్ర నగర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఇక, డ్రగ్ టెస్ట్ లో ఇద్దరు మైనర్లకు గంజాయి పాజిటివ్ వచ్చింది. అలాగే, 8 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, ఈ పార్టీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మొయినాబాద్ పోలీసులు.
Read Also: Astrology: అక్టోబర్ 06, సోమవారం దినఫలాలు.. ఏ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి..?
ఇక, పట్టుబడిన వారిలో 12 మంది యువతులు, 38 మంది యువకులు ఉండగా, వీరిలో చాలా మంది మైన్లరే ఉన్నారని పోలీసులు తెలిపారు. అధిక డబ్బు ఈజీ మనీకి అలవాటు పడి ఫామ్ హౌస్ ఫార్మ్ హౌస్ ఓనర్ ఈ పార్టీని ఏర్పాటు చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో ఫేక్ ఐడీని క్రియేట్ చేసి ఒక్కరికి 13,00 వందల రూపాయల ఎంట్రీ ఫీజ్ తో మద్యం, గంజాయి, డ్రగ్స్ అని యువతకు ఎర వేశాడు. అయితే, పోలీసుల ఏంట్రీతో ఒక్క సారిగా కథ అడ్డం తిరిగింది. అధిక డబ్బుకు అలవాటు పడి యువతను పక్క దారి పట్టిస్తున్న ఫామ్ హౌస్ ఓనర్ ని అరెస్ట్ చేశారు, ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.