YS Jagan: ఏపీలో కల్తీ మద్యం అమ్మకాలు.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
- అన్నమయ్య జిల్లాలో నకిలీ మద్యం తయారీపై స్పందించిన జగన్..
- నకిలీ లిక్కర్ తయారీలో రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారా?..
- టీడీపీ నేతలు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీని పెట్టి సరఫరా చేస్తున్నారు..
- రాష్ట్రానికి సంపద పెరగడం లేదు.. లిక్కర్ సిండికేట్లతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు: వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఏపీలో కల్తీ మద్యం అమ్మకాలపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారంటూ ఎక్స్ వేదికగా ఆరోపణలు చేశారు. నకిలీ లిక్కర్ వ్యవహారంలో రాష్ట్రాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్న చంద్రబాబు.. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో టీడీపీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనం.. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమోగానీ, లిక్కర్ సిండికేట్లతో, నకిలీ మద్యం తయారీల ద్వారా ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టిన టీడీపీ నేతలు.. మీ పార్టీ నాయకులు అక్రమ సంపాదనను పైనుంచి కింది వరకూ పంచుకుంటున్నారు అని ఆరోపించారు. వ్యవస్థికృతంగా ఈ దందా కొనసాగుతోంది.. మీ లిక్కర్ సిండికేట్లకు, గ్రామస్థాయి వరకూ విస్తరించిన బెల్టు షాపుల మాఫియాలకు, కల్తీ మద్యం వ్యాపారానికి అడ్డు రాకూడదనే వ్యూహం ప్రకారం ప్రభుత్వ మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారని వైఎస్ జగన్ తెలిపారు.
Read Also: Harish Rao: నువ్వేం.. ముఖ్యమంత్రివి..? సీఎంపై మాజీ మంత్రి ఫైర్
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
ఇక, ఉద్దేశ పూర్వకంగా వాటిని తీసివేసి సిండికేట్లకు అప్పగించారు అని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. మద్యం దుకాణాలు టీడీపీ వాళ్లవే.. బెల్టుషాపులు టీడీపీ వాళ్లవే.. ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లు టీడీపీ వాళ్లవే. అక్రమ మద్యం తయారీ దారులు కూడా టీడీపీ నేతలే.. వాళ్లు తయారుచేస్తారు, ఆ తయారు చేసిన దాన్ని మీ వాళ్లే, మీ షాపుల ద్వారా మీ బెల్టుషాపుల ద్వారా అమ్ముతారు.. అలా వచ్చిన డబ్బును వాటాలు వేసుకుని పంచుకుంటారు.. రాష్ట్రంలో ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యమేనన్న వార్తలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి.. లిక్కర్ వ్యవహారంలో మీ వ్యవస్థీకృత నేరాల ద్వారా ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడుతుంది.. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును మీరు దోచుకుంటున్నారు.. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దుచేసి విచ్చలవిడిగా మద్యం విక్రయాలను పెంచారని ఆరోపించారు. మార్ట్‌లు పెట్టారు, తిరిగి మళ్లీ ఇల్లీగల్ బెల్టు షాపులు తెరిచారు.. ప్రతి వీధిలో రాత్రిపగలు తేడాలేకుండా లిక్కర్ అమ్మడం మొదలు పెట్టారు.. ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లు తెరిచారు.. CAG నివేదికల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 5 నెలల్లో, అంటే ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారానే లిక్కర్ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం ₹6,782.21 కోట్లు.. 2025-26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఐదు నెలల్లో, విచ్చలవిడిగా లిక్కర్ అమ్మినా సరే ఆదాయం ₹6,992.77 కోట్లు మాత్రమే వచ్చిందని జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Family tragedy: లేచిపోయిన భార్య.. పిల్లలతో కలిసి భర్త సూసైడ్..
అయితే, కేవలం 3.10 శాతం వృద్ధి మాత్రమే.. ఎక్కడైనా ప్రతిఏటా సహజంగా వచ్చే 10% పెరుగుదల కూడా రాలేదని వైఎస్ జగన్ తెలిపారు. అంటే దీని అర్థం, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని, సిండికేట్ల రూపంలో, కల్తీ లిక్కర్ తయారీ రూపంలో మీ ముఠా కొట్టేస్తున్నట్టేగా అర్థం.. కల్తీ లిక్కర్ వ్యవహారాలు కొన్ని నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి.. ఉత్తరాంధ్రలోనూ, గోదావరి జిల్లాల్లోనూ, ఇప్పుడు రాయలసీమలోనూ ఈ ఘటనలు బయటకు వచ్చాయి.. కానీ విచారణ, దర్యాప్తు తూతూ మంత్రంగానే సాగుతున్నాయి.. కారణం, ఈ అక్రమాల వెనుక ఉన్నది మీ బినామీలు అయిన మీ టీడీపీ వాళ్లే.. దీన్ని అరికట్టాలన్న చిత్తశుద్ధి ఉండి ఉంటే, ఇవాళ మొలకల చెరువు ఘటన తర్వాత విస్తృతంగా తనిఖీలు జరిగి, కల్తీ బాటిళ్లను పట్టుకునేవారు. కాని అలా జరగలేదు.. పైగా దీనికి కారకులైన వారిని రక్షించే ప్రయత్నం చేశారు.. అన్నమయ్య జిల్లా స్థాయి ముఖ్యనేత, టీడీపీ ఇన్‌ఛార్జి కనుసన్నల్లో ఈ కల్తీమద్యాన్ని తయారు చేస్తే, వీరిని తప్పిస్తూ తూతూమంత్రంగా కేసు నమోదు చేశారని జగన్ ఆరోపించారు.
Read Also: Janhvi Kapoor : హమ్మయ్య.. జాన్వీ కపూర్ కు ఓ హిట్ పడింది..
కాగా, ఈ కేసులో నిందితుడు, టీడీపీ ఇన్‌ఛార్జి అనచరుడు మద్యం దుకాణంవైపు అధికారులెవ్వరూ కన్నెత్తి చూడలేదని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ నేరాన్నంతటినీ విదేశాల్లో ఉన్న మరో వ్యక్తి పైకి తోసేసే ప్రయత్నం చేస్తున్నారు.. అసలు సూత్రధారులను కాపాడేలా స్కెచ్ వేసి, మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు మీ కార్యాలయ డైరెక్షన్‌లో రాత్రికి రాత్రే కేసు మార్చేశారు.. ఈ దందాకు మీ నుంచి, మీ చెప్పు చేతల్లో ఉన్న వ్యవస్థల నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టే.. మీ సొంత ఆదాయాలకోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం న్యాయమేనా? అని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!