Team India: టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వన్డే వరల్డ్ కప్ 2027లో ఆడించాలి.. లేకపోతే అది పెద్ద తప్పిదమే అవుతుందని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ పేర్కొన్నారు.
Minister Tummala: ఖమ్మం నగరంలో రోడ్లు, డ్రైనేజీలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం పట్టణం గతంలో చిన్న పంచాయతీగా ఉండేది, కేవలం 4 వేల జనాభా మాత్రమే ఉండేవాళ్లు అన్నారు.
Ponnam vs Adluri Laxman Row: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
CP Sajjanar: హైదరాబాద్ లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై నగర కమిషనర్ ఆఫ్ పోలీస్ వీసీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా డ్రైవింగ్ చేసే సమయంలో మొబైల్ ఫోన్లో వీడియోలు చూడడం లేదా ఇయర్ఫోన్స్ ఉపయోగించడం అత్యంత ప్రమాదకరమని, ఇది శిక్షార్హమైన నేరం అని స్పష్టం చేశారు.
BRS in Bus Protest: టికెట్ ధరల పెంపుకు వ్యతిరేకంగా ఆర్టీసీ బస్సేక్కి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. నాంపల్లి ఎక్సిబిషన్ గ్రౌండ్ బస్ స్టాప్ నుంచి అసెంబ్లీ బస్ స్టాప్ వరకు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Congress Meeting: తెలంగాణ కాంగ్రెస్లో నేడు ( అక్టోబర్ 7న) కీలక పరిణామాలు చోటు చేసుకోనుంది. ముఖ్యంగా, బీసీ నేతల అత్యవసర సమావేశం ఈరోజు సాయంత్రం 4:00 గంటలకు జరగనుంది. రేపు ( అక్టోబర్ 8న) హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణకు రానుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
Rahul Dravid: టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ క్రికెట్లో అద్భుతమైన ఆట తీరును కనబరుస్తున్నాడు. అండర్-19 వన్డే టోర్నమెంట్ అయినా వినూ మన్కడ్ ట్రోఫీ కోసం ప్రకటించిన కర్ణాటక జట్టుకు అన్వయ్ కెప్టెన్గా ఎంపికయ్యాడు.
Hyderabad: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఘట్ కేసర్ పరిధిలోని ఔషపూర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పిల్లల పంచాయతీ వల్ల ఏకంగా తండ్రి బలి అయ్యాడు. అయితే, ఇద్దరు చిన్నారులు గొడవ పడడంతో అమీర్ అనే వ్యక్తి మందలించాడు. ఇక, తన కొడుకునే మందలించాడనే కోపంతో అమీర్ ఇంటి మీదకు వెళ్ళి మరీ అలీ అనే వ్యక్తి దాడి చేశాడు.