ఉత్తరప్రదేశ్లోని కస్గంజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో ఎటాహ్లోని కసా పూర్వి గ్రామం నుంచి గంగాస్నానానికి వెళ్తున్న గ్రామస్తుల ట్రాక్టర్ బదౌన్ హైవేపై ఉన్న చెరువులో అదుపు తప్పి పడిపోయింది.
గంజాయి వినియోగంపై స్వేచ్ఛాయుత విధానాలు అవలంబిస్తున్న యూరప్ దేశాల సరసన జర్మనీ చేరిపోయింది. తాజాగా, ప్రతిపక్ష పార్టీలు, వైద్య సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ గంజాయి నియంత్రిత సాగు, పరిమిత వ్యక్తిగత వినియోగానికి జర్మనీ ఆమోదించింది.
జగన్ వల్ల ఏపీ బ్రాండ్ డామలిష్ అయింది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించలేని పరిస్థితి ఏర్పాడింది.. వైసీపీ అరాచకాలను సామాన్యులు మొజలకుని నా వరకు పవన్ కళ్యాణ్ వరకు భరించామన్నారు.
మరో 50 రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో టీడీపీ- జనసేన ఉమ్మడిగా తొలి జాబితాను వెల్లడించాయి. చంద్రబాబు, పవన్ లు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశారు. వివాదం లేని నియోజకవర్గాలకు తొలి జాబితాలో రెండు పార్టీలు చోటు కల్పించారు.
ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్య చేధనలో ముంబయి ఇండియన్స్ సూపర్ విక్టరీ సాధించింది. ముంబై జట్టుకు చివరి బంతికి 5 రన్స్ కావాల్సిన సమయంలో అప్పుడే క్రీజులోకి వచ్చిన సజనా సిక్స్ కొట్టి గెలుపును అందించింది. దీంతో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీపై ముంబై నాలుగు వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది.
లోక్సభ ఎన్నికలకు ముందు ఈరోజు భారత కూటమిలోని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య సీట్ల షేరింగ్ పై పొత్తు కుదిరినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఆప్- కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో ఐదు రాష్ట్రాల పొత్తును ప్రకటించే అవకాశం ఉంది.