ఇరాన్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి కొనసాగుతున్నాయి. జైష్ అల్ అదిల్ ఉగ్రవాద సంస్థకు చెందిన సీనియర్ మిలిటెంట్ కమాండర్‌తో పాటు అతడి అనుచరులపై పాకిస్తాన్ భూ భాగంలో ఇరాన్ ఆర్మీ అధికారులు దాడి చేసి హత మార్చారు.
నేడు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా భారీ సమావేశం నిర్వహించనున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికల సన్నాహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో నిర్మితమైన ఎన్టీపీసీకి చెందిన 1,600 మెగావాట్ల లారా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్‌ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ (శనివారం) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేస్తారు.
నాలుగు రోజులుగా కొనసాగుతున్న మేడారం మహాజాతర చివరి అంకానికి చేరుకుంది. నేడు వన దేవతలు వన ప్రవేశంతో జాతర ముగియనుంది. నేటి సాయంత్రం పూజారులు గద్దెల దగ్గరకు వచ్చి సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించిన తర్వాత వన దేవతల వన ప్రవేశం స్టార్ట్ అవుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ కోడ్ మారనుంది. ప్రస్తుతం టీఎస్ కోడ్‌తో రిజిస్ట్రేషన్ చేస్తుండగా ఇక టీజీగా మారబోతుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నేడో, రేపో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.
టీడీపీ- జనసేన కలయిక రాజకీయ లబ్ది కోసం కాదు.. భావి తరాల అభివృద్ధి కోసం అని పేర్కొన్నారు. జగన్ పరిపాలనపై విసిగిపోయిన ప్రజల గళాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వినిపిస్తారు.. పేదలకు పెత్తందార్లకు యుద్ధం అంటున్న సీఎం ఎందుకు ప్రజల సొమ్ముతో రెండు హెలికాప్టర్ లు పెట్టుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు. ఏ కారణంతో డబ్బులు వృదా చేస్తున్నారు.. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతి పక్షాలను విమర్శించడానికి ఉపయోగించుకున్నారు అని నాదేండ్ల మనోహర్ ఆరోపించారు.
నేను ఏమైనా అడిగితే నన్ను సవాల్ చేస్తావా అంటాడు కానీ.. తాను చేసిన మంచిని మాత్రం చెప్పడం లేదన్నారు. ఆయన ఏం చేయలేదు కాబట్టి ఏమీ చెప్పలేడు.. మనం సిద్ధం అంటుంటే చంద్రబాబు భార్య మా ఆయన సిద్దంగా లేడు అంటుంది అని జగన్ అన్నారు.
ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. ప్రజల వద్దకే పాలన కల్పన జగన్ తోనే సాధ్యం అయిందన్నారు. విలేజ్ క్లినిక్ ల ద్వారా ప్రజా ఆరోగ్యం భద్రత కల్పించిన జగన్.. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించిన జగన్ ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు.