WPL 2024: సజన దెబ్బకి దిమ్మతిరిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. వాట్ ఏ షాట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL2024) రెండో సీజన్ శుక్రవారం నాడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో స్టార్ట్ అయింది. ఆరంభ మ్యాచ్ లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, గత సీజన్ రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీ పడ్డాయి. ఇరు జట్ల మధ్య ఉత్కంఠ పోరు కొనసాగింది. ఇక, ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్య చేధనలో ముంబయి ఇండియన్స్ సూపర్ విక్టరీ సాధించింది. ముంబై జట్టుకు చివరి బంతికి 5 రన్స్ కావాల్సిన సమయంలో అప్పుడే క్రీజులోకి వచ్చిన సజనా సిక్స్ కొట్టి గెలుపును అందించింది. దీంతో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీపై ముంబై నాలుగు వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది.
Read Also: OG Movie: పవన్ ఎన్నికల్లో బిజీ అయినా అనుకున్న రోజుకే దింపుతాం!
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ఇక, చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టీమ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టానికి 171 రన్స్ చేసింది. 172 పరుగుల లక్ష్య చేధనతో బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ ఉమెన్స్ టీమ్ ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ హెలీ మాథ్యూస్ సున్నా పరుగులకే ఔట్ అయింది. ఆ తర్వాత యాస్తికా భాటియా ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేయగా.. 45 బంతుల్లో 57 పరుగులు చేసి ఔట్ అయింది. నాట్ స్కివర్ బ్రంట్ (19) త్వరగానే అవుటైన.. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్ (55) రెచ్చిపోయింది. చివరకు కౌర్ అవుట్ కావడంతో మ్యాచ్ టెన్సన్ గా మారింది.
Read Also: IND vs ENG 4th test: తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్
అయితే, రెండో ఇన్సింగ్ చివరి బంతికి ఐదు పరుగులు చేయాల్సి పరిస్థితి ఏర్పాడింది. దీంతో క్రీజులోకి అప్పుడే సజీవన్ సజన వచ్చారు. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ విజయం దాదాపు ఖాయమని అందరు అనుకుంటున్న టైంలో చివరి బంతికి సంజన సిక్స్ కొట్టి టీమ్ ను విజయతీరాలకు చేర్చారు. దీంతో ముంబై ఇండియన్స్ మహిళల జట్లు నాలుగు వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.
SAJANA, YOU ROCKSTAR FOR MUMBAI 🤯
– 5 runs needed in the last ball & she hit an incredible six…..!!!!pic.twitter.com/u3gkp4ob5E
— Johns. (@CricCrazyJohns) February 23, 2024
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!