ఒక పరువు నష్టం కేసులో తనకు జారీ అయిన సమన్లను ఢిల్లీ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టులో నేడు (సోమవారం) విచారణ జరుగనుంది.
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు రాలేని చెప్పారు. దర్యాప్తు సంస్థ ఇచ్చిన సమన్లకు ఇవాళ ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండగా.. తాను హాజరుకావడం లేదని సీఎం చెప్పారు.
పాకిస్థాన్‌లోని లాహోర్‌లో యువతి డ్రెస్ పై అరబిక్ భాషలో ఖురాన్‌ను కించపరిచే రాతలున్నాయన్న ఆరోపణలతో కొందరు చుట్టుముట్టారు. వెంటనే ఓ మహిళా పోలీసు ఆ యువతిని ఆ మూక నుంచి రక్షించింది.
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు హస్తం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరారు.
లోకో పైలట్లు లేకుండానే ఓ గూడ్సు రైలు దాదాపు 70 కిలో మీటర్లు మేర పరుగులు తీసింది. నెమ్మదిగా కదిలిన రైలు ఆ తర్వాత గంటకు 100 కిలోమీటర్ల వేగంతో సుమారు ఐదు స్టేషన్లను దాటి చివరకు పంజాబ్‌లోని ఉంచి బస్సీ రైల్వే స్టేషన్ లో పట్టాలపై ఇసుక బస్తాలను, చెక్క దిమ్మెలు అడ్డుగా ఉంచి రైలును ఆపు చేయగలిగారు.
కోస్ట్ గార్డ్ కు చెందిన మహిళా అధికారి పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు (సోమవారం) విచారించనుంది. షార్ట్ సర్వీస్ కమిషన్‌కు అర్హులైన మహిళా అధికారులకు పర్మినెంట్ కమిషన్‌లో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు.
రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్ ట్రంప్ స్పీడ్ గా దూసుకుపోతున్నాడు. తాజాగా, సొంత రాష్ట్రం సౌత్ కరోలినాలో జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ ఓటమి పాలయ్యారు.
ఇండిగో ఫ్లైట్‌లోని ఫుడ్ సెక్షన్ లో బొద్ధింకలు కనిపించడం తీవ్ర అలజడి రేపుతుంది. విమానంలో శుభ్రతను పాటించడం లేదని వాదన వినిపిస్తున్నాయి. తరుణ్ శుక్లా అనే ఓ ప్యాసింజర్ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశాడు.
నేడు తెలంగాణ రాష్ట్రానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ రానున్నారు. విజయ సంకల్ప యాత్రలో పాల్గొనబోతున్నారు. కాగా, ఇవాళ రాత్రి సికింద్రాబాద్ లో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. ఢిల్లీ, గుజరాత్, హర్యానా, గోవా, చండీగఢ్‌లలో సీట్ షేరింగ్‌కు రెండు పార్టీలు ఓకే చెప్పుకున్నాయి.