US Road Accident: కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
California: అమెరికాలోని సెంట్రల్ కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ ఓ వ్యాను లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటన సెంట్రల్ కాలిఫోర్నియాలోని మదేరా సిటీలో శుక్రవారం నాడు చోటు చేసుకుందని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురు రైతులతో పాటు పికప్ ట్రక్కు డ్రైవర్ మరణించినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Purandeswari: పొత్తులపై పురంధేశ్వరి క్లారిటీ!
Also Read
- Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
కాగా, మదేరా సిటీ సమీపంలో ఉదయం 6:15 గంటలకు ప్రమాదం జరిగిందని సెంట్రల్ కాలిఫోర్నియా అధికారి జేవియర్ రువల్కాబా తెలిపారు. ఈ ప్రమాదంలో వ్యాన్ పూర్తిగా దెబ్బతినడం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఓ రైతు గాయపడ్డాడు.. అతన్ని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రిలో చేర్చారని రువల్కాబా చెప్పుకొచ్చారు. ఇక, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో ఇద్దరు మాత్రమే సీటు బెల్టు పెట్టుకున్నారు.. వ్యాన్‌లోని ఇతర వ్యక్తులు సీటు బెల్టు పెట్టుకుని ఉంటే ప్రాణాలతో బయటపడేవారని వెల్లడించారు. బ్లాక్ పికప్ ట్రక్ రెండు లేన్ల హైవేపై వేగంగా నడుపుతోందని ప్రత్యేక్ష సాక్షి పోలీసులకు తెలిపినట్లు రువల్కాబా తెలిపారు. ఈ సమయంలో ఈ ప్రమాదం జరిగింది.. డ్రైవరు మత్తు మందు సేవించి ఉన్నారా లేదా అనే విషయంపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!