ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పేదలకు ఒక్క సెంటు కూడా ఇళ్ల స్థలం ఇవ్వలేదు.. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు ఓర్వడం లేదు అని ఆరోపించారు.
అగ్రహారం, వెంగముక్కలపాలెంలలో భూములు చూశాం.. ఇక్కడ కూడా టీడీపీ కోర్టు కేసులు వేయించి ఇబ్బందులు పెట్టాలని చూసింది అని ఆరోపించారు. భూములకు నాకు ఎకరాకు 8 లక్షల రూపాయలు ఇచ్చారని ఆరోపిస్తున్నారు.. ఆ ఆరోపణలు రుజువు చేస్తే నా ఆస్తి మొత్తం రాసిస్తాను అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.
జగన్ ని దింపాలని అన్ని పార్టీలు కలిసి పోరాటం చేస్తున్నాయన్నారు. అధికారంలోకి వస్తే ప్రజలకు ఎమి చేస్తామో అన్నది మాత్రం చెప్పడం లేదు.. పవన్ కళ్యాణ్ కుల మతాలను రెచ్చకొడుతున్నాడు.. చంద్రబాబుని తిట్టిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటున్నాడు అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో లెఫ్ట్ పార్టీల నేతలు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో సీట్ల పంపకంతో పాటు ఉమ్మడి మేనిఫేస్టోపై చర్చించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తామన్నారు.
రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణ వార్త విని షాక్ కు గురి చేసింది అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తండ్రి సాయన్న చనిపోయిన ఏడాదిలోపే ఆమె మృతి చెందడం దురదృష్టకరం అని పేర్కొన్నారు.
ఇవాళ ఉదయం 10.30 గంటలకు సచివాలయంలోని బ్లాక్- 2 వద్ద మంత్రుల కమిటీతో ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై చర్చలు జరుపనున్నారు. కాగా, పెండింగ్ డీఏలతో పాటు బకాయి పడిన సరెండర్ లీవ్‌లు, పెన్షన్ బకాయిలు, సీపీఎస్ ఉద్యోగులకు చెందిన కాంట్రిబ్యూషన్ అన్నీ కలిపి 20 వేల కోట్ల రూపాయల మేర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని ఉద్యోగ సంఘాలు తెలిపాయి.
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇవాళ అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల చేయనున్నారు. మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను నేడు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అంతేకాదు మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారి కోటా టోకెన్లు విడుదల చేయనున్నారు.