నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకాలను ఆరంభిస్తుంది. గృహజ్యోతి పథకం కింద తెల్ల రేషన్ కార్డు దారులకు నెలకు 200 యూనిట్ల వరకూ ఫ్రీ కరెంట్ లభించనుంది. అలాగే తెల్లరేషన్ కార్డు ఉన్న లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్ కేవలం 500రూపాయలకే ఇవ్వనున్నారు.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ.. నా తల్లిదండ్రుల సాక్షిగా మాట ఇస్తున్నాను.. బనగానపల్లెలో పేదలకు నా సొంత డబ్బులతో 2 సెంట్ల స్థలం ఇచ్చి తీరుతా! అని వెల్లడించారు. నేను బనగానపల్లె ప్రజలకు రుణపడి ఉన్నాను అని ఆయన పేర్కొన్నారు.
మహారాష్ట్రలో మరోసారి రిజర్వేషన్ కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. అంబాద్ తాలూకాలోని తీర్థపురి పట్టణంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ దగ్గర మరాఠా నిరసనకారులు రాష్ట్ర రవాణా బస్సును తగులబెట్టినట్లు ఓ అధికారి వెల్లడించారు.
మంత్రాలయం ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ.. శ్రీ వాల్మీకి మహర్షి శ్రీరాముని చరిత్ర రాసి ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడు అని తెలిపారు. శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది.. శ్రీ శ్రీ వాల్మీకి మహర్షి చరిత్రలో నిలిచాడు అని ఆయన పేర్కొన్నారు.
ముస్లిం వివాహాలు, విడాకుల చట్టాన్ని రద్దు చేసేందుకు అస్సాం ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. ఇక, అస్సాం ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రంలో విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.
భారతదేశంలో పేదరిక నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పలు కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయని నీతి అయోగ్ తెలిపింది. అది జరిపిన తాజా సర్వేలో భారత్లో దాదాపు 5 శాతం మేర పేదరికం తగ్గిందని నీతి అయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం పేర్కొన్నారు.
ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ ఇవాళ ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ పథకాన్ని ఒక కుంభకోణంగా ఆయన అభివర్ణించారు.
జ్ఞానవాపి మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు నేటి ఉదయం సంచలన తీర్పు వెల్లడించింది. జ్ఞానవాపి మసీదు సెల్లార్లోని వ్యాస్ కా తేకానాలో హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతిస్తూ ఇటీవల వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కూడా సమర్థించింది.
మాల్దీవుల్లో వందలాది మంది భారత సైనికులు ఉన్నారంటూ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ చేసిన ఆరోపణలను ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అబ్దుల్లా షాహిద్ తోసిపుచ్చారు. తమ దేశ భూభాగంలో సాయుధులైన విదేశీ సైనికులెవరూ లేరని వెల్లడించారు.