MLC Balmoor Venkat: జీవో-3 పై కవిత మహిళాలను తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్- 1 నోటిఫికేషన్ పై ఇచ్చిన మెమో మీరు ఇచ్చారు.. ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేని మీరు.. ఇప్పుడు మట్లాడుతున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెబ్ నోట్, మెమోలు విడుదల చేసి మోసం చేసింది మీరు అంటూ మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట మీద నిలబడింది మేము.. తప్పులు చేసింది మీరు.. ధర్నా చేస్తా అంటున్నది మీరు అని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శలు గుప్పించారు.
Read Also: Pakistan Boxer: విదేశాల్లో తోటి క్రీడాకారిణి డబ్బు దొంగిలించి.. పరారైన పాకిస్తాన్ బాక్సర్!
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఫాలో కానిది మీరు అని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తే.. బీఆర్ఎస్ నేతలు కూడా తట్టుకోలేక పోతున్నారు అంటూ మండిపడ్డారు. ప్రభుత్వం పైకి ఆటో కార్మికులను ఉసిగోలిపారు.. ఇప్పుడు నిరుద్యోగులను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు.. తప్పు చేసింది మీరే.. ధర్నాలు చేస్తాం అంటున్నది మీరే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లెవనెత్తె అంశాలపై చర్చకు మేము సిద్ధం అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క రోజైనా దీని మీద మాట్లాడితే గౌరవం ఉండేది అని బల్మూరి వెంకట్ వెల్లడించారు.