BJP leaders: రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సభలు విజయవంతం అయ్యాయి అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ రోజు నుంచి రెండు డిజిటల్ కాంపైన్ లు ప్రారంభిస్తున్నాము.. ఒకటి మన మోడీ , రెండోది ప్రశ్నిస్తున్న తెలంగాణ.. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఇచ్చింది వాటిని ఎలా అమలు చేస్తారనేది వారికే క్లారిటీ లేదు అని ఆయన విమర్శలు గుప్పించారు. వీడియో వ్యాన్స్ ద్వారా మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేసింది అనే అంశాలపై ప్రచారం చేయాలని అని పిలుపునిచ్చారు. రేపటి నుంచి మేనిఫెస్టో కోసం రాష్ట్ర వ్యాప్తంగా సలహాలు స్వీకరణ కార్యక్రమం ఉంటుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Nagari: రోజాపై సంచలన ఆరోపణలు.. వ్యతిరేకవర్గం బహిరంగ సవాల్..!
ఇక, ప్రధాని మోడీనీ పెద్దన్న అని రేవంత్ రెడ్డి ఎందుకు అన్నారో ఆయన్నే అడగండి అంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పెద్దన్న అన్నంత మాత్రాన ఒకటి అయినట్టా.. 2014 నుంచి 2023 మార్చ్ వరకు తెలంగాణకు మోడీ ప్రభుత్వం ఇచ్చిన నిధులు, ప్రాజెక్ట్లు, సహకారంపై IIGH తయారు చేసిన నివేదికను కిషన్ రెడ్డి విడుదల చేశారు. ఇక, ఇవాళ రాష్ట్ర బీజేపీ నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో సమావేశం అయ్యారు. ఈ వర్చువల్ భేటీలో డీకే అరుణ, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తో పాటు పలువురు కమలనాథులు హాజరయ్యారు.