MS Dhoni New Role: ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు. కొత్త సీజన్, కొత్త రోల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. వేచి ఉండండి అంటూ ఇవాళ అతను తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. ఇక, సోషల్ మీడియాకు దూరంగా ఉండే ధోని.. కొత్త రోల్ అంటూ పోస్ట్ చేయడంతో ఎంఎస్డీ ఫ్యాన్స్ రకరకాలుగా ఊహించుకుంటున్నారు.
Read Also: Supreme court: ఎలక్టోరల్ బాండ్లపై ఎస్‌బీఐ అభ్యర్థన ఇదే!
అయితే, వచ్చే సీజన్‌లో ఎంఎస్ ధోని కోచ్ గా కనిపించబోతున్నారని కొందరు.. మెంటార్ కమ్ కోచ్ అంటూ మరికొందరు.. ఇక, కెప్టెన్సీ బాధ్యతలను వదిలేసి కేవలం ప్లేయర్‌గా ఉంటాడని ఇంకొందరు అనుకుంటున్నారు. మరి కొందరేమో ధోని పోస్ట్ వెనక పరామార్దం ఏమో అర్దం కాకపోవడంతో జుట్టు పీక్కుంటున్నారు. గత కొంతకాలంగా ధోని ఐపీఎల్ రిటైర్మెంట్‌పై అనేక ఊహాగానాలు వినిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తలా తాజా పోస్ట్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. ధోని పోస్ట్‌పై తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం సైతం రియాక్ట్ అయింది. కొత్త పాత్రలో లియో అంటూ ఎంఎస్ ధోని అభిమానుల్లో మరింత ఆసక్తి రేకెత్తించేలా పోస్ట్ చేసింది. మొత్తంగా ధోని తికమక పెట్టే పోస్ట్ చేసి సోషల్ మీడియా మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు.
Read Also: JP Nadda: రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు..
ఇక, ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి స్టార్ట్ కాబోతుంది. తొలి మ్యాచ్‌లోనే సీఎస్కే ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు చెన్నైలోని చిదంబరం స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. భారత్ లో సార్వత్రిక ఎన్నికల కారణంగా ఈసారి ఐపీఎల్ షెడ్యూల్‌ను దశల వారీగా ప్రకటించే అవకాశం ఉంది. తొలి విడతలో ఏప్రిల్ 7వ తేదీ వరకు జరిగే మ్యాచ్‌ల వివరాలను మాత్రమే ఐపీఎల్ నిర్వహకులు ప్రకటించారు.
Facebook post of MS Dhoni.
– It's time for the Thala show in IPL 2024. 🦁 pic.twitter.com/vM1HBtrKEa
— Johns. (@CricCrazyJohns) March 4, 2024