KTR: విరామం కొరకు కారు గ్యారేజ్కు పోయింది.. మళ్ళీ సత్తా చాటుదాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliamentary Election: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఐదోసారి నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక, మనకు అధికారం పోయిందని ఎవరు దిగులు పడొద్దు.. 100 స్పీడ్తో 10 సంవత్సరాలు ప్రయాణం చేశాం అని పేర్కొన్నారు. ఇప్పుడు కాస్త విరామం కొరకు కార్ గ్యారేజ్ కు పోయింది.. మళ్ళీ సత్తా చాటుదాం అని చెప్పుకొచ్చారు. మనకు మంచే జరిగింది ఉన్న దిష్టి పోయి.. కేసీఆర్ విలువ ఎందో ప్రజలందరికీ తెలిసింది అని కేటీఆర్ తెలిపారు.
Also Read
- Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
- Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
- SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
- Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
కాళేశ్వరం దండగా అన్న కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరంలో రెండు పిల్లర్లు కుంగి పోతే రిపేర్ చేయకుండా కేసీఆర్ను బద్నాం చేయడానీకి ప్రయత్నం చేస్తున్నారు.. 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడన్న నర్మాల ప్రాజెక్ట్ నీళ్లు నింపినారా.. నీళ్లు నింపిన ఘనత కేసీఆర్ దే అని చెప్పుకొచ్చారు. మనం ఇచ్చిన ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంది.. చేనేత కార్మికులను కడుపులో పెట్టుకొని ఉపాధి కల్పించాం.. పదేండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఎప్పుడన్నా ఒక్క మాటా అన్నామా.. ఇప్పుడు అంటున్నాం సన్యాసులు, దౌర్భాగ్యులు అని ఆయన వెల్లడించారు. మా మీద కోపంతో నేతన్నలకు బతుకమ్మ చీరెలు ఆర్డర్ ఇవ్వడం లేదు.. రైతులకు నీళ్లు ఇవ్వకుండా కేసీఆర్ మీద బురద జల్లెందుకు చూస్తున్నారు అని కేటీఆర్ అన్నారు.
Read Also: Indraja: దయచేసి ఆ పనికి మమ్మల్ని వాడుకోకండి.. మగవారికి ఇంద్రజ విజ్ఞప్తి
డిసెంబర్ 9న అన్ని హామీలు నేరవెస్తా అని మాట ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట తప్పారు అని కేటీఆర్ అన్నారు. మన ప్రభుత్వం కేవలం 4 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయాం.. అధికార ఒత్తిడిలో నేను మీకు సమయం ఇవ్వలేక పోయాను ఇప్పటి నుంచి మీ కష్ట, సుఖాల్లో నేను ఉంటాను.. కాంగ్రెస్ పార్టీ దిక్కుమాలినట్లు చేస్తున్నారు.. పార్లమెంట్ ఎన్నికల్లో మనం విజయం సాధించుకుందాం అని ఆయన చెప్పుకొచ్చారు. మన పార్టీ నుంచి వెళ్ళే వారిని ఎవరు అపోద్దు, కొత్త నాయకత్వాన్ని ఏర్పర్చుకుందాం.. గత ఐదేళ్ల కింద పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ కుమార్ ను ఓడగొట్టుకొని తప్పు చేసుకున్నాం మరోసారి అలాంటి తప్పు చేయద్దు అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
Read Also: Maldives: చైనాలో మాల్దీవుల ఒప్పందం.. భారత అధికారులు వెళ్లిపోవాలని ఆదేశం..
ఇక, బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటుకు ఏం చేయలేదు.. కేవలం మతం పేరుతో ఓట్లు అడగడం తప్ప కరీంనగర్ కు ఈ సన్యాసి ఏం చేశారు అంటూ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది అయోధ్య రామమందిర పేరు మీద రాజకీయం చేస్తూ ఓట్లు దందుకొనెందుకు ప్రయత్నం చేస్తున్నారు అని విమర్శలు గుప్పిస్తున్నారు. బండి సంజయ్ సవాల్ చేస్తున్నా.. కరీంనగర్ పార్లమెంటు ఏం అభివృద్ధి చేశావు.. వినోద్ కుమార్ ఏం అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమా.. చెప్పు ముస్తాబాద్ వస్తావా.. కరీంనగర్ వస్తావా..? అంటూ సవాల్ విసిరారు. ఇక, ఎల్లుండి జిల్లా పోలీసు కార్యాలయం ఆఫీస్ ప్రారంభోత్సవానికి రేవంత్ రెడ్డి వస్తున్నారు అవి కట్టింది మనమే కదా అని గుర్తు చేశారు. 12 తేదీన పార్లమెంట్ ఎన్నికల “కథన భేరి” కరీంనగర్ నుంచి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. మీరంతా నా కుటుంబ సభ్యులు.. ఎక్కడ పోగుట్టుకున్నమో అక్కడే గెలుచుకుందాం.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎల్అర్ఎస్ పై ధర్నా చేయాలి అని కేటీఆర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
-
SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!